Thursday, June 18, 2026
News Navigation
Thursday, June 18, 2026
News Navigation

Breaking

Thursday, June 18, 2026
Home Andhra Pradesh నెల్లూరు పార్లమెంట్ అభ్యర్థిగా విజయసాయి రెడ్డి…

నెల్లూరు పార్లమెంట్ అభ్యర్థిగా విజయసాయి రెడ్డి…

by Prakash
vijay sai reddy

సీఎం జగన్‌ మోహన్‌ రెడ్డి ఆదేశాల మేరకు నెల్లూరు పార్లమెంట్ అభ్యర్థిగా బరిలో దిగుతున్నట్లు రాజ్యసభ సభ్యులు విజయ సాయి రెడ్డి తెలిపారు. నెల్లూరు పార్లమెంట్ పరిధిలోని 7 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఇప్పటికే అభ్యర్థులు ఖరారు అయ్యారని చెప్పారు. పుట్టి పెరిగిన గడ్డపై పోటీ చేయడం సంతోషంగా ఉందని, గెలిచి ప్రజలకు సేవ చేస్తానని పేర్కొన్నారు. జిల్లా మీద తనకు పూర్తి అవగాహన ఉందని, రాజ్యసభ సభ్యుడిగా ఉంటూ జిల్లాను అభివృద్ధి చేసినట్లు తెలిపారు. అభివృద్ధిపై ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలు అర్థరహితమని అన్నారు. వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీని మరోసారి గెలిపించేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని తెలిపారు. ఈనెల 10న సిద్ధం సభలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి మేనిఫెస్టో ప్రకటిస్తారని పేర్కొన్నారు. మూడు సిద్ధం మహాసభలు చరిత్రలో నిలిచిపోయేలా పార్టీ శ్రేణులు హాజరయ్యారని తెలిపారు. ప్రజలకు ఇచ్చిన 99 శాతం హామీలను సీఎం జగన్‌ అమలు చేశారని స్పష్టంచేశారు. మరింత మెరుగైన పరిపాలన అందించేందుకు సీఎం జగన్ సిద్ధంగా ఉన్నారని అన్నారు.

Advertisements

You may also like

Our Visitor

025424
Total views : 147249

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.