95
వినుకొండ మండలం వెంకుపాలెం గ్రామ సమీపాన ట్రాక్టర్ అదుపుతప్పి బోల్తా పడడంతో ఎనిమిది మందికి గాయాలైన సంఘటన చోటు చేసుకుంది. శనివారం ఉదయం బొల్లాపల్లి మండలం వెల్లటూరు గ్రామం నుండి గాంధీ నగర్ కు మిరప పంట కోత కోసం 20 మంది కూలీలు ట్రాక్టర్ లో వెళ్తుండగా వెంకుపాలెం సమీపన ట్రాక్టర్ అదుపుతప్పి బోల్తాపడడం జరిగింది. ఈ సంఘటనలో 8 మందికి గాయాలు ఒకరికి తీవ్రగాయం మిగతా వారికి స్వల్ప గాయాలు అవడంతో వెంటనే పట్టణంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు.
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
ఇది చదవండి: అరకులోయలో ఘోర రోడ్డు ప్రమాదం..
మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి