మోత్కూర్ మున్సిపల్ కేంద్రంలో బుధవారం రాత్రి కిడ్నాపర్ల (kidnapers) కలకలం నెలకొంది. మున్సిపల్ కేంద్రంలోని పాత అక్షర స్కూల్ ఏరియాలో గుర్తు తెలియని ముగ్గురు అగంతకులు చిన్నారులకు చాక్లెట్ల ఆశ చూపి ఎత్తుకెళ్లేందుకు ప్రయత్నించారు. కారులో వచ్చిన అగంతకులు ఓ చిన్నారికి చాక్లెట్లు ఇచ్చి పిలుస్తుండగా అంతలోనే ఓ పెద్దాయన గమనించి మీరు ఎవరని, మిమ్ములను ఎప్పుడూ ఇక్కడ చూడలేదని, పిల్లలకి ఎందుకు చాక్లెట్లు ఇస్తున్నారని ప్రశ్నించాడు. దీంతో ఆ ముగ్గురు అగంతకులు కారులో పరారయ్యారు.
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
విషయం పోలీసులకు తెలియడంతో సంఘటన స్థలానికి చేరుకుని విచారించినట్టు తెలిసింది. అగంతకులు ఏ రూట్లో వెళ్లారన్నది పోలీసులు గాలింపు చేపట్టారు. పట్టణంలో ఏర్పాటు చేసిన ఏ ఒక్క సీసీ కెమెరాలేవీ పని చేయడం లేదు. రాత్రి కావడంతో అగంతకులు ఆచూకీ దొరకడం పోలీసులకి కష్ట సాధ్యంగా మారింది. ఆ గల్లీలో స్ట్రీట్ లైట్లు కూడా లేవు. ఇటీవల పట్టణంలో పట్టపగలే తాళం వేసిన ఇళ్లను దొంగతనాలు పెరిగి పోవడం, ప్రస్తుతం కిడ్నాపర్ల కలకలంతో పోలీసులు ఏమి పట్టనట్టుగా వ్యవహరిస్తున్నారని పోలీసుల పైన ప్రజలకు ఉన్న నమ్మకం లేకుండా పోతుందని కళ్లకు కట్టినట్టు కనిపిస్తుందని ప్రజలు ఆరోపిస్తున్నారు.
ఇది చదవండి: చంద్రబాబు నాయుడు దిష్టిబొమ్మను కాల్చిన వైసిపి నాయకులు
మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి