Sunday, May 31, 2026
News Navigation
Sunday, May 31, 2026
News Navigation

Breaking

Sunday, May 31, 2026
Home Andhra PradeshEast Godavari పిఠాపురంలో డ‌మ్మీ ఈవీఎమ్‌ల క‌ల‌కలం..

పిఠాపురంలో డ‌మ్మీ ఈవీఎమ్‌ల క‌ల‌కలం..

by Rama
YCP Campaign

పిఠాపురం (Pithapuram) : కాకినాడ జిల్లా పిఠాపురంలో ఎన్నిక‌ల వేళ డ‌మ్మీ ఈవీఎమ్‌లు క‌ల‌క‌లం రేపాయి. పెద్ద ఎత్తున మూట‌ల‌తో వైసీపీ ఎన్నిక‌ల ప్ర‌చార (YCP Election Campaign) సామాగ్రిలో క‌లిసి ఇవి ఉండ‌టంతో అధికారులు కంగుతిన్నారు. ప్ల‌యింగ్ స్క్వాడ్ చేసిన త‌నిఖీల్లో పిఠాపురం బైపాసు రోడ్డులో వెళుతున్న బోలేరో వాహ‌నంలో ఇవి ప‌ట్టుబ‌డ‌టంతో ఆ వాహ‌నాన్ని అధికారులు సీజ్ చేశారు.

పిఠాపురం నియోజ‌క‌వ‌ర్గంలో ప‌వ‌న్ పోటీ చేస్తుండ‌టంతో అంద‌రి దృష్టి పిఠాపురంపైనే ఉంది. ఇక్క‌డ వైసీపీ ప‌లు ఎత్తుగ‌డ‌లు వేస్తుంద‌న్న ప్ర‌చారం ఉంది. ఈనేప‌థ్యంలో మంగ‌ళ‌వారం రాత్రి భారీ ఎత్తున డ‌మ్మీ ఈవీఎమ్‌లు ప‌ట్టుబ‌డ‌టంతో అధికారులు సైతం కంగుతిన్నారు. కాకినాడ నుండి పెద్ద ఎత్తున వైసీపీ ఎన్నిక‌ల ప్ర‌చార సామాగ్రిని తుని త‌ర‌లిస్తుండ‌గా పిఠాపురం బైపాసు రోడ్డు వ‌ద్ద ప్ల‌యింగ్ స్క్వాడ్ అధికారులు వీటిని ప‌ట్టుకున్నారు. భారీ మూట‌ల‌తో డ‌మ్మి ఈవీఎమ్ లు ఉండ‌టంతో త‌నిఖీలు చేసిన అధికారులు సైతం నివ్వెర‌పోవాల్సి వ‌చ్చింది. ఇవి పూర్తిగా ఎల‌క్ట్రానిక్ విధానంలో ఉండ‌టంతో వీటిని ఎందుకు త‌ర‌లిస్తున్నార‌నే దానిపై ఆరా తీస్తున్నారు.

వీటితోపాటు జ‌గ‌న్ చిత్రాలు ఉన్న మాస్క్‌లు, వైసీపీ టోపీలు, జెండాలు, కండువాలు, బొట్టు స్టిక్క‌ర్లు ఇలా భారీగా వైసీపీ ఎన్నిక‌ల ప్ర‌చార సామాగ్రిని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఎటువంటి ర‌వాణా అనుమ‌తులు లేక‌పోవ‌డంతో సీజ్ చేసామ‌ని, జీఎస్టీ అధికారుల‌కు అప్ప‌గించి కేసు న‌మోదు చేయిస్తామ‌న్నారు. ఇదిలా ఉండ‌గా ఎల‌క్ట్రానిక్ విధానంలో ఉన్న ఈవీఎమ్‌ల‌పై మాత్రం అధికారులు ఎటూ తేల్చ‌లేదు. దీనిపై ఎన్నిక‌ల ఉన్న‌తాధికారుల‌కు ఫిర్యాదు చేస్తామ‌ని ప్ల‌యింగ్ స్క్వాడ్ అధికారులు పైడిరాజు, ఆర్‌.వి.ప్ర‌సాద్ తెలిపారు.

ఇది చదవండి: అధికార పార్టీ, బిజెపి, జనసేన నాయకులు మధ్య తీవ్ర ఘర్షణ


‘మన డాక్టర్ బాబే’ సినిమాని అందరూ చూసి సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను – టీజర్ లాంచ్ ఈవెంట్‌లో వీఎన్ ఆదిత్య..
శరణ్య-సుధీక్ష సమర్పణలో స్కంద ఫిల్మ్స్ బ్యానర్ మీద ‘మన డాక్టర్ బాబే’ అనే సినిమాని కృతాక్షి …
ఐపీఎల్‌ 2026 ఫైనల్‌కు రంగం సిద్ధం..
ఐపీఎల్‌ 2026 సీజన్‌కు నేడు గ్రాండ్‌ ఫినాలేతో తెరపడనుంది. ఒకవైపు డిఫెండింగ్‌ ఛాంపియన్‌ రాయల్‌ ఛాలెంజర్స్‌ …
కృష్ణా జిల్లాలో ఆక్రమణకు గురవుతున్న సముద్ర తీరం..
సముద్ర గర్భం కుచించుకుపోతోంది. నానాటికీ మడ అడవులు అంతరించిపోతున్నాయి. సుప్రీంకోర్టు మార్గదర్శకాలు, CRZ నిబంధనలు సముద్ర …

Follow us on : Google News మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.


CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి


Advertisements

You may also like

Our Visitor

019145
Total views : 89980

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.