Monday, May 18, 2026
News Navigation
Monday, May 18, 2026
News Navigation

Breaking

Monday, May 18, 2026
Home Film ఘనంగా జోష్ సౌత్ ఇండియన్ నంది అవార్డ్స్ -2024

ఘనంగా జోష్ సౌత్ ఇండియన్ నంది అవార్డ్స్ -2024

by Rama
Nandi Awards

హైదరాబాద్ : జోష్ సౌత్ ఇండియన్ నంది అవార్డ్స్ (Josh South Indian Nandi Awards) కార్యక్రమం హైదరాబాద్ హరిహర కళాభవన్ లో ఘనంగా జరిగింది. తెలుగు చిత్ర పరిశ్రమలోని 24 శాఖలలో ప్రతిభ కనబరిచిన వారికి ఈ అవార్డ్స్ అందించి సత్కరించారు. ఈ కార్యక్రమంలో బింబిసారా దర్శకుడు వశిష్ట, కొరియోగ్రాఫర్ ప్రేమ్ రక్షిత్, నటులు మురళీధర్ గౌడ్, అజయ్ ఘోష్, రచ్చ రవి, మాణిక్, హీరోయిన్ నేహా రెడ్డి, నటులు ప్రొడ్యూసర్ ముసఅలీఖాన్, సీనియర్, నటులు అర్జున్ రాజు, తిరుపతి దొరయ్, రెజ్లర్ భువనేశ్వరి అవార్డులు అందుకున్న వారిలో ఉన్నారు.

బింబసారా డైరెక్టర్ వశిష్ట మాట్లాడుతూ.. తాను చేసిన బింబిసారా మూవీకి బెస్ట్ డైరెక్టర్ గా నంది అవార్డ్స్ రావడం చాలా సంతోషం ఉందని.. ఈ అవార్డ్ ప్రధానం చేసిన “జోష్” సౌత్ ఇండియన్ నంది అవార్డ్స్ చైర్మన్ కి కృతజ్ఞతలు తెలిపారు.

కొరియోగ్రాఫర్ ప్రేమ్ రక్షిత్ మాట్లాడుతూ… RRR సినిమాలో నాటు నాటు పాటకు గాను ఈ అవార్డ్స్ తీసుకోవడం మర్చిపోలేని అనుభూతి.. ఈ అవార్డ్స్ ప్రధానం చేసిన “జోష్” నేషనల్ ఫిల్మ్ అకాడమీ చైర్మన్ కి కృతఙ్ఞతలు తెలియజేస్తూ ఇతర కళాకారులను ప్రోత్సాహించాలని కోరుకుంటున్నానని అన్నారు.

నటుడు మాణిక్ మాట్లాడుతూ… రెండు రాష్ట్రాల ప్రభుత్వాలు ఇవ్వలేని అవార్డ్స్ ను ఒక సామాన్య పౌరుడు ఒక చిన్న గ్రామము నుండి వచ్చి చిన్న , పెద్ద తేడా లేకుండా తెలంగాణ ప్రభుత్వం సహకారంతో నంది అవార్డ్స్ ఇవ్వడం నిజంగా అభినందనీయమన్నారు.

ఇది చదవండి: మీ ఫ్యామిలీ స్టార్స్ ను సర్ ప్రైజ్ విజిట్ చేయబోతున్న “ఫ్యామిలీ స్టార్” టీమ్

నటుడు రచ్చ రవి మాట్లాడుతూ… ఈ అవార్డు రావడం చాలా సంతోషం ఉందని, తనకు ఇంత గౌరవం ఇచ్చిన”జోష్’ అవార్డ్స్ నిర్వాహకులకు కృతజ్ఞతలు తెలిపారు.

డీజే టిల్లు ఫేమ్ మురళీధర్ గౌడ్ మాట్లాడుతూ… డీజే టిల్లు చిత్రంలో నటించిన బెస్ట్ సపోర్ట్ రోల్ కు గాను “జోష్ ” సౌత్ ఇండియన్ నంది అవార్డ్స్ తీసుకోవడం చాలా సంతోషం.. జోష్ హోల్ టీం అందరికి శుభాకాంక్షలు తెలిపారు.

నేహా రెడ్డి మాట్లాడుతూ… బెస్ట్ యాక్ట్రెస్ మా ఊరి సినిమాకు జోష్ సౌత్ ఇండియన్ నంది అవార్డ్ ఇస్తారని ఊహించలేదు. నా టాలెంట్ ను గుర్తించి నన్ను సెలెక్ట్ చేసిన ‘జోష్ “సౌత్ ఇండియన్ చైర్మన్ “జోష్ ” గారికి కృతఙ్ఞతలు తెలిపారు

అజయ్ గోష్ బెస్ట్ మాట్లాడుతూ.. విలన్ గా పుష్ప సినిమాకు గాను నంది అవార్డ్స్ ఇచ్చిన నిర్వాహకులకు కృతజ్ఙతలు. రెండు తెలుగు  ప్రభుత్వాలు చేయలేని ఈ అవార్డ్స్ కార్యక్రమాన్ని ఒక సాధారణ పౌరుడు చేయడం నిజంగా అభినందనీయమన్నారు.

సౌత్ ఇండియన్ నంది అవార్డ్స్ చైర్మన్ సంజోష్ మాట్లాడుతూ… తెలుగు చిత్ర పరిశ్రమలో ప్రతిభ కనబర్చినవారికి రెండు సార్లు జోష్ టాలెంట్ అవార్డ్స్ ఇవ్వడం జరిగింది. మూడోసారి చాలా ఘనంగా జోష్ సౌత్ ఇండియన్ నంది అవార్డ్స్ కార్యక్రమం విజయవంతం అవడం చాలా అనందంగా ఉంది. ఈ కార్యక్రమానికి వచ్చి సినీ, రాజకీయ ప్రముఖులకు ప్రత్యేక ధన్యవాదాలు. అవార్డ్ గ్రహితలకు శుభాకాంక్షలు. ప్రతి ఏడాది ఈ అవార్డ్స్ ను తమ సంస్థ నుంచి ఇస్తాం అన్నారు. తమ అవార్ట్ ఫంక్షన్ కి సహకరించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు.

Follow us on : Google News మరిన్నితాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.


మున్సిపల్ కమిషనర్, వైకాపా నాయకుల మధ్య భారీ వాగ్వాదం..
ఏలూరు కలెక్టరేట్ సాక్షిగా హైడ్రామా నడిచింది. ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కాస్తా… అధికారులకు, వైకాపా …
వరంగల్‌లో డీఆర్‌ఐ అధికారుల సంచలన ఆపరేషన్..
వరంగల్‌లో అంతర్జాతీయ స్మగ్లర్ల తరహాలో సాగుతున్న వన్యప్రాణుల అక్రమ రవాణా గుట్టును డిరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ …
పుట్టపర్తిలో పర్యావరణ హితంగా కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ సరికొత్త ముందడుగు..
సరికొత్త ఆదర్శానికి వేదికైంది శ్రీ సత్యసాయి జిల్లా కలెక్టరేట్. ఇంధన పొదుపు, పర్యావరణ పరిరక్షణ కేవలం …

CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి


Advertisements

You may also like

Our Visitor

014486
Total views : 80353

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.