Tuesday, June 2, 2026
News Navigation
Tuesday, June 2, 2026
News Navigation

Breaking

Tuesday, June 2, 2026
Home Telangana వివాదంలో చిక్కుకున్న మాజీ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి..

వివాదంలో చిక్కుకున్న మాజీ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి..

by Satya
MLA Muthireddy Yadagiri Reddy

జనగామ మాజీ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి(MLA Muthireddy Yadagiri Reddy) మరో వివాదంలో చిక్కుకున్నారు. భూ వివాదంపై సొంత పార్టీకి చెందిన మాజీ మున్సిపల్ చైర్ పర్సన్, కౌన్సిలర్స్ గాడిపెల్లి ప్రేమలత రెడ్డి(Gadipelli Premalatha Reddy) కుమారుడు గాడిపెల్లి రాజేందర్ రెడ్డి(Gadipelli Rajender Reddy) పోలీసులకు ఫిర్యాదు చేశారు. చీటకోడూరులోని తమ స్వంత పట్టా భూమి సర్వే నంబర్ 214లో నుంచి జనగామ రెవిన్యూ పరిధిలోని సర్వే సంబర్ 39 లోకి అక్రమంగా దారి తీసుకున్నాడని ఫిర్యాదు చేశారు. గాడిపెల్లి రాజేందర్ రెడ్డి ఫిర్యాదుపై జనగామ ఏసీపీ అంకిత్ కుమార్ శంక్వాడ్, ఆర్డీఓ విచారణ చేపట్టారు. వివాదాస్పద భూమిని పరిశీలించిన తర్వాత కేసు నమోదు చేశారు. ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి, ఆయన అనుచరుడు బూరెడ్డి ప్రమోద్ రెడ్డి పై ఐపీసీ 447, 427, 506 రెడ్‌ విత్‌ 34 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. తనను విదేశాలకు వెళ్లకుండా ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి అడ్డుకున్నారని బాధితుడు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. జనగామ ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి భూ కబ్జాలకు పాల్పడ్డారని ప్రత్యర్థులు ఆరోపించారు.

ఇది చదవండి: గద్వాలలో మాజీ మంత్రి హరీష్ రావు కామెంట్స్…

గత ఏడాది అసెంబ్లీ ఎన్నికల సమయంలో ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డిపై ఆయన కూతురే స్వయంగా పోలీసులకు ఫిర్యాదు చేసింది. బహిరంగంగా మీడియాముందు తండ్రి అక్రమాలపై మాట్లాడింది. తన తండ్రి భూకబ్జాలకు పాల్పడ్డాడని చేర్యాల పోలీసులకు ఫిర్యాదు చేసింది. తెలంగాణలో బీఆర్ఎస్ అధికారంలో ఉన్న సమయంలో ముత్తిరెడ్డిపై అనేక ఆరోపణలు వచ్చాయి. అయితే, అధికారం ఉందనే అండతో ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి తప్పించుకున్నారని ప్రత్యర్థులు ఆరోపిస్తున్నారు. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండడంతో ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి బాధితులు పోలీసులను ఆశ్రయిస్తున్నారు. గతంలో ఉమ్మడి వరంగల్ జిల్లా కలెక్టర్‌ పట్ల ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి వ్యవహరించిన తీరు కూడా అప్పట్లో వివాదాస్పదమైంది. ఆ వివాదం సమయంలో ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి తీరుపై ఐఎఎస్ అధికారులు ప్రభుత్వానికి ఫిర్యాదు కూడా చేశారు. ఇక, ప్రభుత్వం మారడంతో ముత్తిరెడ్డి యాదగిరెడ్డి చేసిన భూ అక్రమాలు ఇప్పుడు వెలుగు చూస్తున్నాయి.

Follow us on : FacebookInstagram, YouTube & Google News


మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.


Advertisements

You may also like

Our Visitor

019570
Total views : 91126

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.