Monday, July 13, 2026
News Navigation
Monday, July 13, 2026
News Navigation

Breaking

Monday, July 13, 2026
Home Andhra Pradesh జనసేన పార్టీకి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఊరట..

జనసేన పార్టీకి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఊరట..

by Satya
Pawan Kalyan

జనసేన పార్టీ(Jana Sena Party)కి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు(High Court of Andhra Pradesh) ఊరట కల్పించింది. పార్టీ సింబల్ పై దాఖలైన పిటిషన్ ను తోసిపుచ్చింది. దీంతో గాజు గ్లాసు గుర్తు జనసేనకే చెందనుంది. ఈమేరకు ఏపీ హైకోర్టు సంచలన తీర్పు వెల్లడించింది. గాజు గ్లాసు కోసం తాము దరఖాస్తు చేసుకుంటే ఎన్నికల కమిషన్ నిబంధనలకు విరుద్ధంగా జనసేనకు కేటాయించిందని రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ ఏపీ హైకోర్టును ఆశ్రయించింది. దీనిపై విచారణ జరిపిన హైకోర్టు తీర్పును రిజర్వ్ చేసి ఈరోజు వెలువరించింది. ఏపీ హైకోర్టు తీర్పుతో గ్లాసు గుర్తు తమకే దక్కడంపై జనసైనికులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

Follow us on : FacebookInstagram, YouTube & Google News

ఇది చదవండి: డాక్టర్ వి.ఎం థామస్ కి తృటిలో తప్పిన ప్రమాదం..


మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.


Advertisements

You may also like

Our Visitor

040019
Total views : 202971

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.

error: