27 ఏళ్ల నాటి శిరోముండనం కేసు(Siromundam Case)లో విశాఖ ఎస్సీ, ఎస్టీ కోర్టు సంచలన తీర్పు వెల్లడించింది. శిరోముండనం కేసులో వైసీపీ ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులకు జైలు శిక్ష విధించింది. 18 నెలల జైలు శిక్ష, 2 లక్షల జరిమానా విధించింది. ఈ కేసులో తోట త్రిమూర్తులతో పాటు 9 మంది నిందితులుగా ఉన్నారు. 1996 డిసెంబర్ 26న వెంకటాయపాలెంలో శిరోముండనం ఘటన జరిగింది. ఎన్నికల కక్షలతో దళిత యువకులకు శిరోముండనం చేశారు.
ఇది చదవండి: శ్రీకాకుళం జిల్లాలో వైసీపీకి భారీ షాక్..!
ఇద్దరికి గుండు కొట్టించడంతో పాటు కనుబొమ్మలు గీయించారు. 1997 జనవరి 1న ఆనాటి జిల్లా ఎస్పీ కేసు నమోదు చేశారు. తోట త్రిమూర్తులతో సహా 9 మందిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదయ్యాయి. 1998లో కేసును కొట్టేస్తూ ప్రభుత్వం జీవో జారీ చేసింది. మళ్లీ 2000 సంవత్సరంలో కేసును ప్రభుత్వం రీ ఓపెన్ చేసింది. మొత్తం 24 మంది సాక్షుల్లో 11 మంది మృతి చెందారు. తాజాగా త్రిమూర్తులుకు విశాఖ ఎస్సీ, ఎస్టీ కోర్టు 18 నెలల జైలు శిక్ష విధించింది.
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
- హైదరాబాద్: జీడిమెట్ల పరిధిలో బంగ్లాదేశీయుల అరెస్ట్.
- స్టీల్ ప్లాంట్లో ప్రమాదంపై చర్యలకు ఉపక్రమించిన ప్రభుత్వం.
- మహబూబ్నగర్ జిల్లా దేవరకద్రలో ఎమ్మెల్యే మధుసూదన్ పర్యటన.
మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.





Total views : 141547