Tuesday, June 2, 2026
News Navigation
Tuesday, June 2, 2026
News Navigation

Breaking

Tuesday, June 2, 2026
Home Telangana యూపీఎస్సీ సివిల్స్‌ ఫలితాలు విడుదల..

యూపీఎస్సీ సివిల్స్‌ ఫలితాలు విడుదల..

by Satya
UPSC Civils Result Released

యూపీఎస్సీ(UPSC) సివిల్స్‌ ఫలితాలు విడుదలయ్యాయి. ఇందులో 1,016 మంది ఎంపికయ్యారు. ఆదిత్య శ్రీవాత్సవ(Aditya Srivatsava)కు మొదటి ర్యాంకు, అనిమేష్‌ ప్రధాన్‌(Animesh Pradhan)కు రెండో ర్యాంకు, దోనూరి అనన్య రెడ్డి(Donuri Ananya Reddy)కి మూడో ర్యాంకు దక్కింది. ఇక ఈ యూపీఎ‍స్సీ ఫలితాల్లో వరంగల్‌కు చెందిన ముగ్గురు సెలక్ట్‌ అయ్యారు. ఇప్పటివరకు అందిన సమాచారం ప్రకారం తెలుగు రాష్ట్రాల అభ్యర్థులకు ర్యాంకుల పంట పండింది. మొత్తం 1,016 మంది ఎంపికయితే.. అందులో తెలుగు అభ్యర్థులు కనీసం 50కి పైగా ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. వరంగల్ టౌన్ కు చెందిన జయసింహారెడ్డి 103 వ ర్యాంక్, గీసుకొండ మండలం అనంతరం గ్రామానికి చెందిన సయింపు కిరణ్ 568 ర్యాంక్, శివనగర్ కు చెందిన కోట అనిల్ కుమార్ 764 ర్యాంక్ సాధించారు. వీరిలో జయసింహారెడ్డికి ఐఏఎస్, కిరణ్ కు ఐపీఎస్, అనిల్ కుమార్ కు ఐఆర్ఎస్ వచ్చే ఛాన్స్ ఉంది.

Follow us on : FacebookInstagram, YouTube & Google News

ఇది చదవండి: డాక్టర్ వి.ఎం థామస్ కి తృటిలో తప్పిన ప్రమాదం..


మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.


Advertisements

You may also like

Our Visitor

019508
Total views : 90869

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.