Wednesday, August 26, 2026
News Navigation
Wednesday, August 26, 2026
News Navigation

Breaking

Wednesday, August 26, 2026
Home Sports నాలుగో విజయంతో ముందుకు వెళుతున్న రాజస్థాన్..

నాలుగో విజయంతో ముందుకు వెళుతున్న రాజస్థాన్..

by Satya
Rajasthan Royals

ఐపీఎల్-17(IPL-17)లో రాజస్థాన్ రాయల్స్‌(Rajasthan Royals)కు ఎదురులేకుండా పోయింది. మైదానంలో అడుగుపెడితే విజయమే అన్నట్టుగా ఆ జట్టు దూకుడు కొనసాగుతోంది. లక్నో వేదికగా శనివారం జరిగిన మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్‌ను 3 వికెట్ల తేడాతో చిత్తు చేసింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన లక్నో 5 వికెట్ల నష్టానికి 196 పరుగులు చేసింది. కెప్టెన్ కేఎల్ రాహుల్(76), దీపక్ హుడా(50) సత్తాచాటారు.

Follow us on : FacebookInstagramYouTube & Google News

అనంతరం లక్ష్యాన్ని రాజస్థాన్ అలవోకగా ఛేదించింది. 19 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 199 పరుగులు చేసింది. కెప్టెన్ శాంసన్(71 నాటౌట్), ధ్రువ్ జురెల్(52 నాటౌట్) అజేయ హాఫ్ సెంచరీలతో జట్టును విజయతీరాలకు చేర్చారు. ఈ సీజన్‌లో రాజస్థాన్ చేతిలో ఓడటం లక్నోకు ఇది రెండోసారి. రాజస్థాన్‌కు వరుసగా ఇది నాలుగో గెలుపు. మొత్తంగా 8వది. దీంతో ఆ జట్టు 16 పాయింట్లతో ప్లే ఆఫ్స్ బెర్త్‌ను దాదాపు ఖరారు చేసుకుంది.


  • విజయవాడ వేదికగా నేడు డబ్ల్యూఏపీఎల్ ప్లేయర్స్ ఆక్షన్.
    మహిళల ఏపీ ప్రీమియర్ లీగ్ ప్లేయర్స్ ఆక్షన్‌కు సర్వం సిద్ధమైంది. విజయవాడ వేదికగా నేడు డబ్ల్యూఏపీఎల్ ప్లేయర్స్ వేలం జరగనుంది. వేలంలో 191 మంది మహిళా క్రికెటర్లు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. మేటి ఆటగాళ్ల కోసం నాలుగు ఫ్రాంచైజీలు పోటీ పడనున్నాయి.…
  • హాకీ ప్రపంచకప్‌ లో ఇంగ్లాండ్‌తో భారత్‌ గోల్‌ లెస్‌ డ్రా.
    భారత మహిళల హాకీ జట్టు ప్రపంచకప్‌లో రెండో రౌండ్‌కు దూసుకెళ్లింది. పూల్‌ డి విభాగంలో ఇంగ్లాండ్‌తో జరిగిన కీలక మ్యాచ్‌ను భారత్‌ 0-0తో డ్రాగా ముగించింది. మ్యాచ్‌ ఆరంభం నుంచి ఇంగ్లాండ్‌ క్రీడాకారిణులు గోల్స్‌ కోసం తీవ్రంగా ప్రయత్నించినా.. భారత డిఫెన్స్‌…
  • బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్‌లో పీవీ సింధుకు షాక్.
    ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్‌లో భారత స్టార్ షట్లర్ పీవీ సింధుకు నిరాశ ఎదురైంది. కీలకమైన ప్రిక్వార్టర్ ఫైనల్ పోరులో చైనా స్టార్ ప్లేయర్ వాంగ్ జియీ చేతిలో సింధు ఓటమి పాలయ్యారు. దీంతో ఛాంపియన్‌షిప్‌లో భారత జట్టుకు వరుస షాక్‌లు తగిలినట్లైంది.…

మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.


Advertisements

You may also like

Copyright © 2026 CVR Telugu. All Rights Reserved.

error: