Monday, July 27, 2026
News Navigation
Monday, July 27, 2026
News Navigation

Breaking

Monday, July 27, 2026
Home Andhra Pradesh చిత్తూరు పుంగనూరులో కొనసాగుతున్న ఉద్రిక్తతలు

చిత్తూరు పుంగనూరులో కొనసాగుతున్న ఉద్రిక్తతలు

by Prakash
High Tension In Chittoor Punganur

తిరుపతి, High Tension In Chittoor Punganur

చిత్తూరు(Chittoor) పుంగనూరులో కొనసాగుతున్న ఉద్రిక్తతలు. రాత్రి సదుం మండలం ఎర్రతివారిపల్లెలో బీసీవై పార్టీ బోడె రామచంద్ర యాదవ్ కాన్వాయ్ లో 10 వాహనాలను ధ్వంసం. రాళ్లు రువ్వి, కట్టెలతో దాడులు చేసిన దుండగులు. సదుం పోలీస్ స్టేషన్ ముందే ప్రచార రథాన్ని తగలబెట్టిన దుండగులు. సదుం మండలంలో వైసీపీ బీసీవై పార్టీ. మధ్యన కొనసాగుతున్న గొడవలు.

ఇవాళ గొడవలు జరిగిన ప్రాంతాలలో పర్యటించనున్న డీఐజీ అమ్మిరెడ్డి | DIG Ammireddy..

రాత్రి నుంచి సదుం మండలంలో కొనసాగుతున్న ఉద్రిక్తతలు. పుంగనూరులో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఓటమి భయంతోనే ఇలాంటి దాడులకు పాల్పడుతున్నారు.

బీసీవై పార్టీకి వస్తున్న ఆదరణను చూసి తట్టుకోలేకుండానే తన అనుచరులతో దాడి చేస్తున్నారు పెద్దిరెడ్డి అంటూ ఆగ్రహం వ్యక్తం చేసిన బోడె రామచంద్ర యాదవ్.

మంత్రి పెద్దిరెడ్డి అనుచరులు, వైసిపి కార్యకర్తలే తమ వాహనాలు ధ్వంసం చేశారని బోడె రామచంద్ర యాదవ్ ఆగ్రహం, అవేదన.

ఓటమి భయంతోనే…

పుంగనూరులో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఓటమి భయంతోనే పుంగనూరులో భయానక వాతావరణాన్ని సృష్టిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు బీసీవై పార్టీ అధ్యక్షుడు బోడె రామచంద్ర యాదవ్. పుంగనూరు లోని గ్రామాలలో ప్రశాంత వాతావరణంలో ప్రచారం చేసుకుంటూ ఉండగా తమ అనుచరులతో తనపై, తన అనుచరుల పై దాడి చేయించి వాహనాలను ధ్వంసం చేయించి ప్రచార రథాలకు నిప్పు పెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు బోడె రామచంద్ర యాదవ్. గత ఐదు సంవత్సరాలుగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అరాచకాలకు అడ్డు అదుపు లేకుండా పోయిందని, ఎన్నికల కోడ్ వచ్చిన తరువాత కూడా పెద్దిరెడ్డి ఆగడాలు ఆగలేదని పోలీస్ స్టేషన్ ముందే తన ప్రచార రథాన్ని తగులబెట్టినా పోలీసులు ప్రేక్షక పాత్ర వహించారు అని ఆరోపించారు బోడే. దాదాపు 30 మందికి పైగా తన అనుచరులకు గాయాలయ్యాయని, వారందరూ వివిధ ఆసుపత్రులలో చికిత్స పొందుతున్నారని, పదుల సంఖ్యలో వాహనాలను ధ్వంసం చేసి ప్రచార రథాలకు నిప్పంటించాలని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాబోవు ఎన్నికలలో పుంగనూరు ప్రజలు ఇవన్నీ గమనించి ఓట్లు వేయాలని అభ్యర్థించారు బీసీవై పార్టీ అధ్యక్షుడు బోడె రామచంద్ర యాదవ్. నిన్న జరిగిన గొడవల కారణంగా ఇరువర్గాలపై పోలీసులు 307 కేసులను నమోదు చేశారు.

Follow us on : FacebookInstagramYouTube & Google News

మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

  • జింబాబ్వేతో జరిగిన T20I సిరీస్‌ను 3-0 తేడాతో కైవసం చేసుకున్న టీమిండియా.
    UK పర్యటనలో నిరాశపరిచిన తర్వాత భారత్ కోరుకున్న ఫలితం ఇదే. జింబాబ్వే గడ్డపై ఆ జట్టును పూర్తిగా అధిగమించి 3-0 తేడాతో క్లీన్ స్వీప్ పూర్తి చేసింది. వాస్తవానికి ఈ సిరీస్ అంతటా జింబాబ్వే జట్టు భారత్కు ఏమాత్రం పోటీనివ్వలేకపోయింది. భారత్…
  • మార్కాపురం జిల్లా అర్ధవీడు మండలంలో వైసీపీకి బిగ్ షాక్.
    మార్కాపురం జిల్లా అర్ధవీడు మండలంలో వైసీపీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. మాగుటూరు పంచాయతీలోని రంగాపురం గ్రామానికి చెందిన 65 కుటుంబాలు వైసీపీని వీడి తెలుగుదేశం పార్టీలో చేరాయి. స్థానిక ఎమ్మెల్యే ముత్తుముల అశోక్ రెడ్డి సమక్షంలో ఈ భారీ చేరికలు జరిగాయి.…
  • రాజకీయాలు కలుషితం అయ్యాయి -సిద్ధరామయ్య.
    కర్ణాటక మాజీ సీఎం సిద్ధరామయ్య సంచలన ప్రకటన చేశారు. తాను 2028 అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయబోనని, ఎన్నికల రాజకీయాల నుంచి శాశ్వతంగా వైదొలుగుతున్నానని స్పష్టం చేశారు. అయితే, ప్రజా జీవితంలోనే కొనసాగుతూ ప్రజల పక్షాన తన గొంతు వినిపిస్తూనే ఉంటానని…
Advertisements

You may also like

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.

error: