ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh)కు ఓటర్లు తరలివెళ్తున్నారు. హైదరాబాద్(Hyderabad) నుంచి సొంతూళ్లకు పయనమయ్యారు. దీంతో, హైదరాబాద్ నుంచి ఏపీకి వెళ్లే రోడ్లన్నీ ఫుల్‌గా కనిపిస్తున్నాయి. సోమవారం ఏపీ అసెంబ్లీ, పార్లమెంటు స్థానాలకు పోలింగ్ జరగనుంది. దీంతో, అక్కడ ఓటు హక్కు ఉన్న వాళ్లందరూ స్వస్థలాలకు బయలుదేరి వెళ్లారు. ఇంకా వెళ్తూనే ఉన్నారు. ఓటు వేసేందుకు ఉత్సాహం చూపుతున్నారు. ఫలితంగా హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్లే హైవేపై వాహనాలు కిక్కిరిసిపోతున్నాయి.
పోలింగ్ తేదీకి ముందు వరుస సెలవులు రావడం కలిసొచ్చింది. వరుసగా మూడు రోజుల పాటు సెలవులు రావడంతో ఓటు వేసేందుకు స్వస్థలాలకు వెళ్తున్నవాళ్లు.. కుటుంబసభ్యులతో సహా తరలివెళ్తున్నారు. శనివారం సెకండ్ సాటర్ డే, ఆదివారం, సోమవారం పోలింగ్ సెలవు వచ్చాయి. దీంతో, శుక్రవారం రాత్రి నుంచే రోడ్లమీద రద్దీ పెరిగింది.
కొందరు అభ్యర్థులు హైదరాబాద్‌లో స్థిరపడ్డ ఏపీ ఓటర్లను రప్పించేందుకు ప్రత్యేకంగా బస్సులను ఏర్పాటు చేశారు. ఇక, సొంత వాహనాలు ఉన్నవాళ్లు.. తమ వాహనాల్లోనే కుటుంబసమేతంగా స్వస్థలాలకు వెళ్లేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. ఫలితంగా రోడ్లమీద వాహనాల రద్దీ భారీగా పెరిగిపోయింది. ముఖ్యంగా తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్ వెళ్లడానికి అవకాశం ఉన్న అన్ని రోడ్లమీద ఇదే పరిస్థితి నెలకొంది. ఫలితంగా వాహనాలు హైవేలపై నెమ్మదిగా ముందుకు కదులుతున్నాయి.
ఇక, హైదరాబాద్ నుంచి విజయవాడ మధ్య ఉన్న టోల్ ప్లాజాలు కిక్కిరిసిపోతున్నాయి. శుక్రవారం రాత్రినుంచే టోల్‌ప్లాజాలన్నీ రద్దీగా మారాయి. టోల్‌ప్లాజాలు దాటేందుకు చాలా సమయం పడుతోంది. ప్రధానంగా చౌటుప్పల్, పంతంగి, చిల్లకల్లు, కీసర టోల్‌ప్లాజాల దగ్గర వాహనాల రద్దీ పెరిగిపోయింది. దీంతో, వాహనాల రద్దీకి అనుగుణంగా ఆయా టోల్‌ప్లాజాల్లో కౌంటర్లను కూడా పెంచేశారు.
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
- గత ప్రభుత్వం రాష్ట్రాన్ని ‘నిరుద్యోగ ఆంధ్రప్రదేశ్’గా మార్చిందన్న టీఎన్ఎస్ఎఫ్.గత ప్రభుత్వం రాష్ట్రాన్ని ‘నిరుద్యోగ ఆంధ్రప్రదేశ్’గా మార్చితే, ప్రస్తుత కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన అతి తక్కువ కాలంలోనే ‘ఉద్యోగాల ఆంధ్రప్రదేశ్’గా తీర్చిదిద్దుతోందని టీఎన్ఎస్ఎఫ్ పేర్కొంది . విజయవాడ గాంధీనగర్ ప్రెస్ క్లబ్ లో కూటమి విద్యార్థి విభాగాల ఆధ్వర్యంలో రౌండ్…
- అమరావతిలో అభివృద్ధి పనులను పరిశీలించిన మంత్రి నారాయణ.అమరావతి రాజధాని ప్రాంతంలో పర్యటించిన మంత్రి నారాయణ.. అభివృద్ధి పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా వైసీపీ అధినేత జగన్‌పై తీవ్ర విమర్శలు గుప్పించిన మంత్రి, అమరావతిపై వైసీపీ తప్పుడు ప్రచారం చేస్తోందని ఆరోపించారు.రాజధాని కోసం భూములు ఇచ్చిన ప్రతి రైతుకూ ప్లాట్లు…
- మంత్రి నారాయణతో భేటీ అయిన సీఆర్‌ఆర్‌ఐ ప్రతినిధులు.మంత్రి నారాయణతో సెంట్రల్ రోడ్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ ప్రతినిధులు భేటీ అయ్యారు. అమరావతిలో ఎల్పీఎస్ జోన్లు నిర్మిస్తున్న సీఆర్‌ఆర్‌ఐ రోడ్లను స్టడీ చేస్తున్నారు. రెండ్రోజులపాటు జోన్లలో ఇంటర్నల్ రోడ్లు, డ్రెయిన్లు, పవర్ లైన్లు అధ్యయనం చేశారు. ఎల్పీఎస్ జోన్-2, 5, 9,…
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.




Total views : 92164