యాంకర్ పార్ట్: ప్రభుత్వ వైద్యశాలకు వచ్చే రోగులకు సౌకర్యాలు కల్పించడంలో అధికారులు అలసత్వం వహిస్తే చర్యలు కఠినంగా ఉంటాయని కనిగిరి ఎమ్మెల్యే డాక్టర్ ముక్కు ఉగ్ర నరసింహ రెడ్డి హెచ్చరించారు. ప్రకాశం జిల్లా కనిగిరి పట్టణంలోని ప్రభుత్వ ఏరియా వైద్యశాలను ఎమ్మెల్యే ఉగ్ర నరసింహారెడ్డి ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆసుపత్రిలోని వార్డుల్లో చికిత్స పొందుతున్న రోగులతోపాటు డయాలసిస్ చేయించుకుంటున్న కిడ్నీ రోగులను కలిసి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. డయాలసిస్ రోగులకు వాహన సౌకర్యం ఏర్పాటు చేసి వారి స్వగ్రామాలకు చేర్చే విధంగా చర్యలు తీసుకుంటామన్నారు. ఆసుపత్రిలో సౌకర్యాలు సక్రమంగా లేకపోవడంపై ఆసుపత్రి సూపరిండెంట్ అబ్దుల్ కలాం పై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆసుపత్రిని క్లీన్ గా ఉంచాలని, రోగులకు శుభ్రతతో కూడిన భోజనాన్ని అందించాలని ఆదేశించారు. మరొకసారి తాను ఆసుపత్రికి తనిఖీకి వచ్చేసరికి ఆసుపత్రిలో సౌకర్యాలు అన్ని మెరుగుపడాలని లేకుంటే సంబంధిత అధికారులు సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే ఉగ్ర నరసింహారెడ్డి హెచ్చరించారు.
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
- చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ వచ్చేనెలలో భారత్‌కి వచ్చే ఛాన్స్.దాదాపు ఏడేళ్ల తర్వాత చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ భారత్‌లో పర్యటించే అవకాశం కనిపిస్తోంది. వచ్చే నెల 12, 13 తేదీల్లో ఢిల్లీలో జరగనున్న బ్రిక్స్ సదస్సులో ఆయన పాల్గొనే అవకాశమున్నట్లు సమాచారం. 2019లో చివరిసారిగా భారత్‌కు వచ్చిన షీ జిన్‌పింగ్,…
- పశ్చిమగోదావరి జిల్లా సముద్రంలో బోటు బోల్తా.పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం మండలం చిన్నలంక వద్ద సముద్రంలో బోటు బోల్తా పడిన ఘటన కలకలం రేపింది. సముద్ర వేటకు వెళ్లిన బోటు.. ఇసుకదిబ్బను ఢీకొనడంతో ఒక్కసారిగా బోల్తా పడింది. బోటులో ఉన్న ఏడుగురు మత్స్యకారులు సముద్రంలోకి దూకి.. ఈదుకుంటూ ఒడ్డుకు…
- 22ఏపై బీజేపీ దీక్షలు.భూ భారతి పేరుతో పెద్ద ఎత్తున అక్రమాలు జరుగుతున్నాయని బీజేపీ ఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి ఆరోపించారు. సెక్షన్ 22ఏ కింద లక్షలాది ఎకరాల భూములను ప్రొహిబిటెడ్ జాబితాలో చేర్చి రైతులను ఇబ్బందులకు గురిచేస్తున్నారని విమర్శించారు. ధరణి పోర్టల్‌పై నిర్వహించిన…
- సూర్యాపేట జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.సూర్యాపేట జిల్లా కోదాడ మండలం ద్వారకుంట సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. హైదరాబాద్ నుంచి ఏలూరు వెళ్తున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు.. ముందు వెళ్తున్న కంటైనర్‌ను అత్యంత వేగంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఐదుగురు ప్రయాణికులు అక్కడికక్కడే మృతి చెందగా..…
- భారత సైన్యం చేతికి ‘షేర్’.. ఏకే-203 రైఫిళ్లు రెడీ.రక్షణ రంగంలో ఆత్మనిర్భరత దిశగా భారత్ మరో కీలక ముందడుగు వేసింది. ఉత్తరప్రదేశ్‌లోని అమేథీ జిల్లా కోర్వాలోని ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలో దేశీయంగా తయారైన ఏకే-203 అసాల్ట్ రైఫిళ్లు భారత సైన్యానికి అందించేందుకు సిద్ధమయ్యాయి. త్వరలోనే వీటి డెలివరీ ప్రారంభం కానుంది. అత్యాధునికమైన…
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.