Wednesday, July 22, 2026
News Navigation
Wednesday, July 22, 2026
News Navigation

Breaking

Wednesday, July 22, 2026
Home International ఇటలీ పార్లమెంటులో షాకింగ్ ఘటన..!

ఇటలీ పార్లమెంటులో షాకింగ్ ఘటన..!

by Satya
Italy Parliament

ఇటలీ పార్లమెంటు(Italy Parliament)లో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. ఓ బిల్లు విషయంలో అధికార, ప్రతిపక్ష పార్టీ ఎంపీలు ఒకరిపై మరొకరు ముష్టిఘాతాలు కురిపించుకున్నారు. స్పీకర్ పోడియం ముందుకు వచ్చిన ఎంపీలు చట్టసభల గౌరవాన్ని మరిచి తన్నుకోవడం సంచలనంగా మారింది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. ఇటలీలోని కొన్ని ప్రాంతాలకు ఆర్థికంగా మరింత స్వేచ్ఛ కల్పించేందుకు ఉద్దేశించిన బిల్లును అధికార కూటమి సభలో ప్రవేశపెట్టింది. ప్రజల నుంచి సేకరించిన పన్నుల వినియోగంపై ఆయా ప్రాంతాలకు మరింత స్వేచ్ఛను ఇచ్చేందుకు ఈ బిల్లును రూపొందించారు. దీన్ని ప్రతి పక్ష సభ్యులు తీవ్రంగా ఖండించారు.

Follow us on : FacebookInstagramYouTube & Google News

ఈ క్రమంలో సెంటర్ – లెఫ్ట్ ఫైవ్ స్టార్ మూమ్‌మెంట్ ఉద్యమానికి చెందిన ఓ చట్టసభ సభ్యుడు పార్లమెంటులో ఇటలీ జాతీయ జెండాను ప్రదర్శించే ప్రయత్నించారు. ఈ క్రమంలో ఇరు వర్గాల మధ్య ముష్టిఘాతాలు, తోపులాట జరిగింది. ఈ బిల్లు కారణంగా ఇటలీలో ఉత్తర – దక్షిణ విభజనలు మరింత తీవ్రమవుతుందని, పేదరికంలో మగ్గుతున్న దక్షిణాది ప్రాంతాలు మరింత ఇబ్బందుల్లో పడతాయని బిల్లును వ్యతిరేకిస్తున్న వారు చెబుతున్నారు. జీ7 శిఖరాగ్ర సదస్సుకు హాజరయ్యేందుకు వివిధ దేశాధినేతలు ఇటలీకి చేరుకుంటున్న సమయంలోనే నేతలు ఇలా విచక్షణ, హుందాతనం మరిచి పరస్పరం దాడులకు దిగడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఘటనపై ఇటలీ విదేశాంగ మంత్రి విచారం వ్యక్తం చేశారు.


  • నీట్‌ నిరసన సెగ హైదరాబాద్‌ కు తగిలింది.
    నీట్‌ నిరసన సెగ హైదరాబాద్‌ కు తగిలింది. నాంపల్లి పరిసర ప్రాంతాలు బీజేపీ, కాంగ్రెస్‌ పార్టీల నాయకులు నిరసనలతో హొరెత్తాయి. లోక్‌సభ ప్రతి పక్ష నాయకుడు రాహుల్‌గాంధీ అరెస్ట్‌ తో పాటు కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ రాజీనామా…
  • జనరిక్ మెడిసిన్ దిగుమతులపై ట్రంప్ కీలక ప్రకటన.
    జనరిక్‌ ఔషధాల దిగుమతులపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ కీలక ప్రకటన చేశారు. ఆగస్టు 1 నుంచి జనరిక్‌ ఔషధాలపై సుంకాలు ఉండబోవని ప్రకటించారు. అమెరికాలోకి దిగుమతి అయ్యే అన్ని జనరిక్‌ ఔషధాలకు సున్నా శాతం సుంకం వర్తిస్తుందని..రెండేళ్ల పాటు ఇది…
  • సి.వి.రావును కలిసిన సినీ నిర్మాత, కాంగ్రెస్‌ నేత బండ్ల గణేష్.
    ప్రముఖ సినీ నిర్మాత, తెలంగాణ కాంగ్రెస్ నాయకుడు బండ్ల గణేష్ ఈరోజు ఇమేజ్ హాస్పిటళ్లు, సీవీఆర్ ఛానళ్ల ఛైర్మన్ సి.వి.రావును మర్యాదపూర్వకంగా కలిశారు. హైదరాబాద్‌లోని సీవీఆర్ న్యూస్ కార్యాలయానికి వచ్చిన బండ్ల గణేష్… తన కుమార్తె వివాహానికి హాజరుకావాలని కోరారు. చైర్మన్…

మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Advertisements

You may also like

Our Visitor

042274
Total views : 223709

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.

error: