ప్రియాంక గాంధీ(Priyanka Gandhi) రాజకీయ ప్రవేశంపై మరోసారి ఉత్కంఠ నెలకొంది. ఇటీవలి ఎన్నికల ముందు ఆమె పోటీకి దిగుతారని వార్తలు వెలువడగా ఆమె వాటిని ఖండించారు. ఇక రాయ్‌బరేలీ, వయనాడ్ నుంచి గెలిచిన రాహుల్ గాంధీ వయనాడ్ సీటు వదులుకోనున్నారన్న వార్తల నడుమ మరోసారి ప్రియాంక ఎన్నికల ఎంట్రీపై ఆసక్తికర కథనాలు వెలువడుతున్నాయి. రాహుల్ వయనాడ్‌ను వదులుకంటే అక్కడి నుంచి ప్రియాంకా గాంధీ బరిలోకి దిగుతారన్న వార్త ప్రస్తుతం సంచలనంగా మారింది.
రాయ్‌బరేలీ, వయనాడ్ నియోజకవర్గాల నుంచి బరిలో నిలిచిన రాహుల్ గాంధీ భారీ మార్జిన్లతో గెలుపొందారు. ఈ నేపథ్యంలో ఆయన చేసిన వ్యాఖ్యలు కూడా ప్రియాంక గాంధీ రాజకీయ భవితవ్యంపై ఉత్కంఠను మరింత పెంచాయి.
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
తన సోదరి వారణాసి నుంచి పోటీ చేసి ఉంటే మోదీ 2-3 లక్షల ఓట్ల తేడాతో ఓడిపోయి ఉండేవారని అన్నారు. ప్రియాంకా గాంధీ ప్రత్యక్ష రాజకీయాల్లో దిగుతారన్న వార్తలు 2019 లోక్‌సభ ఎన్నికల నుంచే మొదలయ్యాయి. అప్పట్లో ఆమె వారణాసి నుంచి పోటీ చేస్తారన్న కథనాలు వెలువడగా ఆమె వాటిని ఖండించారు. ఆ తరువాత 2022 యూపీ ఎన్నికల సందర్భంగా ప్రియాంక మాట్లాడుతూ తాను సీఎం అభ్యర్థిని కావచ్చని కూడా వ్యాఖ్యానించారు. వయనాడ్ నియోజకవర్గాన్ని రాహుల్ వదులుకుంటారా? లేదా? లేదా అన్న దానిపై ప్రియాంక గాంధీ నిర్ణయం ఆధారపడి ఉంటుందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఈ విషయమై తాను డైలమాను ఎదుర్కొంటున్నానని రాహుల్ గాంధీ అన్నారు. అయితే, తన నిర్ణయం రెండు నియోజకవర్గాల ప్రజలకు సంతోషాన్ని ఇస్తుందని స్పష్టం చేశారు.
- భారత సైన్యం చేతికి ‘షేర్’.. ఏకే-203 రైఫిళ్లు రెడీ.రక్షణ రంగంలో ఆత్మనిర్భరత దిశగా భారత్ మరో కీలక ముందడుగు వేసింది. ఉత్తరప్రదేశ్‌లోని అమేథీ జిల్లా కోర్వాలోని ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలో దేశీయంగా తయారైన ఏకే-203 అసాల్ట్ రైఫిళ్లు భారత సైన్యానికి అందించేందుకు సిద్ధమయ్యాయి. త్వరలోనే వీటి డెలివరీ ప్రారంభం కానుంది. అత్యాధునికమైన…
- స్పేస్ స్టార్టప్‌ల సీఈఓలతో ప్రధాని మోదీ భేటీ.ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పేస్ స్టార్టప్ సంస్థల సీఈఓలతో సమావేశమయ్యారు. దేశంలోని ప్రతిభావంతులైన స్పేస్ స్టార్టప్‌ల ప్రతినిధులతో భేటీ కావడం సంతోషంగా ఉందని మోదీ తెలిపారు. స్టార్టప్‌ల శక్తి, ఆశయం తనను ఎప్పటిలాగే ముగ్ధుడిని చేశాయని పేర్కొన్నారు. యువ సంస్థల ఆలోచనలు,…
- తమిళనాడు అసెంబ్లీలో డీఎంకే వర్సెస్ టీవీకే.తమిళనాడు అసెంబ్లీలో ఎమ్మెల్యేలకు ప్రభుత్వ కార్ల కేటాయింపు అంశం రాజకీయ దుమారానికి దారితీసింది. ఈ విషయంలో అధికార టీవీకే, డీఎంకే సభ్యుల మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. ఎమ్మెల్యేలకు కార్లు కేటాయించే ముందు వారి ఎన్నికల అఫిడవిట్లలో పేర్కొన్న ఆస్తుల వివరాలను…
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.