Friday, August 28, 2026
News Navigation
Friday, August 28, 2026
News Navigation

Breaking

Friday, August 28, 2026
Home Latest News పాయకరావుపేట ఎమ్మెల్యే వంగలపూడి అనితను హోం మంత్రి పదవి వరించింది.

పాయకరావుపేట ఎమ్మెల్యే వంగలపూడి అనితను హోం మంత్రి పదవి వరించింది.

by Rama
పాయకరావుపేట ఎమ్మెల్యే వంగలపూడి అనితను హోం మంత్రి పదవి వరించింది.

ఉమ్మడి విశాఖపట్నం జిల్లా నుంచి ఈ మంత్రివర్గంలో పదవి దక్కించుకున్న ఏకైక ఎమ్మెల్యే వంగలపూడి అనిత.ఉమ్మడి విశాఖ జిల్లాలో ఎంతో మంసీనియర్ నేతలు ఉన్నప్పటికీ.. పార్టీ పట్ల ఆమె చూపిన విధేయతకు మంత్రి పదవిని కేటాయించిన చంద్రబాబు.. ఈసారి ఏకంగా హోంమంత్రిని చేశారు.ఈ ఎన్నికల్లో టీడీపీ పాయకరావుపేట నుంచి మరోసారి వంగలపూడి అనితకు అవకాశం ఇచ్చింది.అధినేత నమ్మకాన్ని నిలబెడుతూ రికార్డు విక్టరీ కొట్టారు వంగలపూడి అనిత. స్థానిక టీడీపీ, బీజేపీ, జనసేన శ్రేణులను కలుపుకుని వెళ్లి 2024 ఎన్నికల్లో పాయకరావుపేట అసెంబ్లీ స్థానం నుంచి 43,727 ఓట్ల తేడాతో గెలిచి చరిత్ర సృష్టించారు.ఉమ్మడి విశాఖ జిల్లా నుంచి మంత్రివర్గంలో చోటు దక్కించుకోవటమే కాకుండా.. హోం మంత్రిగా నియమితులయ్యారు.ఉపాధ్యాయురాలిగా పనిచేస్తూ రాజకీయాల్లోకి వచ్చారు వంగలపూడి అనిత. 2014కు ముందు టీడీపీతో తన రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించిన అనిత… 2014 ఎన్నికల్లో టీడీపీ నుంచి పోటీచేసి విజయం సాధించారు2014 నుంచి 2019 వరకు పాయకరావుపేట ఎమ్మెల్యేగా నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేశ2019 ఎన్నికల్లో టీడీపీ అధిష్టానం ఆమెను.. పాయకరావుపేట నుంచి కొవ్వూరుకు పంపింది. అయితే 2019 ఎన్నికల్లో ఓడిపోయినా.. కూడా టీడీపీ కోసం వంగలపూడి అనిత పనిచేశారు.తెలుగు మహిళ రాష్ట్ర అధ్యక్షురాలిగా పనిచేస్తూ వైసీపీ విధానాలను ఎండగడుతూ వచ్చారు.ఈ క్రమంలోనే సోషల్ మీడియాలో ట్రోలింగ్ ఎదుర్కొన్నా వెనక్కి తగ్గలేదు.

Follow us on : FacebookInstagramYouTube & Google News

  • చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ వచ్చేనెలలో భారత్‌కి వచ్చే ఛాన్స్‌.
    దాదాపు ఏడేళ్ల తర్వాత చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ భారత్‌లో పర్యటించే అవకాశం కనిపిస్తోంది. వచ్చే నెల 12, 13 తేదీల్లో ఢిల్లీలో జరగనున్న బ్రిక్స్ సదస్సులో ఆయన పాల్గొనే అవకాశమున్నట్లు సమాచారం. 2019లో చివరిసారిగా భారత్‌కు వచ్చిన షీ జిన్‌పింగ్,…
  • పశ్చిమగోదావరి జిల్లా సముద్రంలో బోటు బోల్తా.
    పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం మండలం చిన్నలంక వద్ద సముద్రంలో బోటు బోల్తా పడిన ఘటన కలకలం రేపింది. సముద్ర వేటకు వెళ్లిన బోటు.. ఇసుకదిబ్బను ఢీకొనడంతో ఒక్కసారిగా బోల్తా పడింది. బోటులో ఉన్న ఏడుగురు మత్స్యకారులు సముద్రంలోకి దూకి.. ఈదుకుంటూ ఒడ్డుకు…
  • 22ఏపై బీజేపీ దీక్షలు.
    భూ భారతి పేరుతో పెద్ద ఎత్తున అక్రమాలు జరుగుతున్నాయని బీజేపీ ఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి ఆరోపించారు. సెక్షన్ 22ఏ కింద లక్షలాది ఎకరాల భూములను ప్రొహిబిటెడ్ జాబితాలో చేర్చి రైతులను ఇబ్బందులకు గురిచేస్తున్నారని విమర్శించారు. ధరణి పోర్టల్‌పై నిర్వహించిన…
  • సూర్యాపేట జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.
    సూర్యాపేట జిల్లా కోదాడ మండలం ద్వారకుంట సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. హైదరాబాద్‌ నుంచి ఏలూరు వెళ్తున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు.. ముందు వెళ్తున్న కంటైనర్‌ను అత్యంత వేగంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఐదుగురు ప్రయాణికులు అక్కడికక్కడే మృతి చెందగా..…
  • భారత సైన్యం చేతికి ‘షేర్’.. ఏకే-203 రైఫిళ్లు రెడీ.
    రక్షణ రంగంలో ఆత్మనిర్భరత దిశగా భారత్ మరో కీలక ముందడుగు వేసింది. ఉత్తరప్రదేశ్‌లోని అమేథీ జిల్లా కోర్వాలోని ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలో దేశీయంగా తయారైన ఏకే-203 అసాల్ట్ రైఫిళ్లు భారత సైన్యానికి అందించేందుకు సిద్ధమయ్యాయి. త్వరలోనే వీటి డెలివరీ ప్రారంభం కానుంది. అత్యాధునికమైన…

మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Advertisements

You may also like

Copyright © 2026 CVR Telugu. All Rights Reserved.

error: