భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం క్రమంగా తగ్గుతోంది.. నిన్న ఉదయం 51.6 అడుగుల వద్ద వరకు చేరిన గోదావరి నీటిమట్టం క్రమంగా తగ్గుతూ వస్తోంది. ఈరోజు ఉదయానికి 47.3 అడుగుల వద్ద గోదావరి ప్రవహిస్తోంది. నిన్న ఉదయం నుంచి ఇప్పటివరకు సుమారు ఐదు అడుగుల నీటిమట్టం తగ్గింది. గోదావరి నీటిమట్టం తగ్గడంతో అధికారులు రెండవ ప్రమాద హెచ్చరిక ఉపసంహరించుకున్నారు. అయితే మొదటి ప్రమాద హెచ్చరిక అమలులో ఉంది. భద్రాచలం వద్ద తగ్గుతున్న నీటిమట్టం నిలిచి ఉండటం వల్ల భద్రాచలం వద్ద స్నాన ఘట్టాల ప్రాంతం వరదనీటిలోనే మునిగి ఉంది. నీటిమట్టం తగ్గడంతో భద్రాచలం నుంచి దుమ్ముగూడెం, చర్ల వెళ్లే ప్రధాన రహదారిపై నిన్న చేరిన వరద నీరు తగ్గింది. దీంతో భద్రాచలం నుంచి దుమ్ముగూడెం చర్ల మండలాలకు రాకపోకలు సాగుతున్నాయి. ఇంకా నీటిమట్టం తగ్గితే భద్రాచలం నుంచి విలీన మండలాలకు వెళ్లే రహదారులు కూడా వరద నీటి నుంచి తేరుకోనున్నాయి.
FOLLOW US ON : FACE BOOK, INSTAGARAM, YOU TUBE, GOOGLE NEWS
- యూట్యూబ్ ఛానల్ ప్రారంభించిన నారా దేవాన్ష్..మంత్రి నారా లోకేష్ తనయుడు నారా దేవాన్ష్ డినో డీట్స్ పేరుతో కొత్త యూట్యూబ్ ఛానల్ ప్రారంభించాడు. ఈ సరికొత్త డిజిటల్ ప్రయాణంపై నారా, నందమూరి కుటుంబసభ్యులు దేవాన్ష్‌కు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ ఛానల్‌కు సంబంధించిన ప్రమోషనల్ టీజర్‌లో మంత్రి నారా…
- పశ్చిమగోదావరి జిల్లాలో మెరిట్ విద్యార్థులకు ఎమ్మెల్యే బహుమతులు..పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం నియోజకవర్గంలో ప్రభుత్వ పాఠశాలల పదో తరగతి మెరిట్ విద్యార్థులకు ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్ ప్రోత్సాహక బహుమతులు అందజేశారు. ప్రధాని నరేంద్ర మోదీ పిలుపు మేరకు సైకిల్‌పై కార్యక్రమానికి హాజరైన ఎమ్మెల్యే ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు..ఈ కార్యక్రమంలో పాల్గొన్న…
- కమిటీల ఏర్పాటుపై కీలక ఆదేశాలు..జనసేన అధినేత పవన్ కల్యాణ్ మంగళగిరిలోని జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో పార్టీ ముఖ్య నేతలతో సమావేశం నిర్వహించారు. పార్టీ సంస్థాగత నిర్మాణం, కమిటీల ఏర్పాటు, నియోజకవర్గాల వారిగా పార్టీ బలోపేతం లాంటి అంశాలపై చర్చించారు. పార్లమెంట్ నియెజకవర్గాల వారీగా ప్రత్యేక…
- ఏపీలో వితంతువులకు శుభవార్త..రాష్ట్రంలోని వితంతువులకు ఏపీలోని కూటమి ప్రభుత్వం శుభవార్త చెప్పింది. కూటమి ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు పూర్తవుతున్న సందర్భంగా జూన్ 12వ తేదీ నుంచి కొత్తగా పింఛన్లు మంజూరు చేయనున్నట్లు రాష్ట్ర మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు ప్రకటించారు. శ్రీకాకుళం జిల్లా నిమ్మాడలోని తన…
- క్వాంటం టెక్నాలజీపై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు..దేశాల భవిష్యత్‌కు ప్రపంచ టెలీకమ్యూనికేషన్ వ్యవస్థ అత్యంత కీలకమని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు తెలిపారు. ఏప్రిల్ 14న ‘క్వాంటం కంప్యూటింగ్ రిఫరెన్స్ ఫెసిలిటీస్’ ప్రారంభోత్సవం అనంతరం, ప్రపంచస్థాయి క్వాంటం వ్యవస్థ దిశగా మరో ముఖ్యమైన అడుగు పడిందన్నారు.దేశీయ సాంకేతిక పరిజ్ఞానంతో…
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి





Total views : 79887