Sunday, May 17, 2026
News Navigation
Sunday, May 17, 2026
News Navigation

Breaking

Sunday, May 17, 2026
Home Main News నేడు తెలంగాణకు కొత్త గవర్నర్ ప్రమాణస్వీకారం

నేడు తెలంగాణకు కొత్త గవర్నర్ ప్రమాణస్వీకారం

by Rama
నేడు తెలంగాణకు కొత్త గవర్నర్ ప్రమాణస్వీకారం

తెలంగాణ రాష్ట్ర గవర్నర్‌గా జిష్ణుదేవ్ వర్మ రాజ్ భవన్ లో ప్రమాణ స్వీకారం చేశారు. ఆయనతో హైకోర్టు సీజే జస్టిస్ అలోక్ అరాధే ప్రమాణ స్వీకారం చేయించారు. నేడు తెలంగాణకు కొత్త గవర్నర్ ప్రమాణస్వీకారం.గవర్నర్ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, ఉపముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క తదితరులు పాల్గొన్నారు.
1957 ఆగస్టు 15న స్వా తంత్ర దినోత్సవం రోజున జన్మించిన జిష్ణుదేవ్ వర్మ….త్రిపుర రాజ కుటుంబానికి చెందిన వ్యక్తి. జిష్ణుదేవ్ వర్మ 1990లో రామ జన్మభూమి ఉద్యమ సమయంలో భారతీయ జనతా పార్టీలో చేరారు. ఇక అప్పటి నుంచి ఆ పార్టీలో కీలకంగా వ్యవహరిస్తూ వచ్చారు. 2018 నుండి 2023 వరకూ త్రిపుర రాష్ట్ర డిప్యూటీ సీఎంగా పని చేశారు. త్రిపురలో విద్యుత్, గ్రామీణాభి వృద్ధి, పంచాయితీ రాజ్, ఆర్ధిక, ప్రణాళిక, సైన్స్ అండ్ టెక్నాలజీ, పర్యావరణ శాఖల బాధ్యతలను కూడా జిష్ణుదేవ్ వర్మ నిర్వహించారు. అంతేకాకుండా గతంలో బాడ్మింటన్ అసోషియేషన్ ఆఫ్ ఇండియాకు కూడా అధ్యక్షుడిగా వ్యవహరించారు.

FOLLOW US ON : FACE BOOKINSTAGARAMYOU TUBE, GOOGLE NEWS

  • ఘనంగా క్రాస్ స్టేట్ రియాల్టీ షో జంగిల్ బుగీ కర్టెన్ రైజర్ ఈవెంట్..
    క్రాస్ స్టేట్ రియాల్టీ షో జంగిల్ బుగి కర్టెన్ రైజర్ ఈవెంట్ శుక్రవారం హైదరాబాద్ లో ఘనంగా జరిగింది. ఈ రియాల్టీ షోలో తెలుగు లయన్స్, హిందీ హాక్స్, తమిళ్ టైగర్స్, మావెరిక్స్, కన్నడ పాంతర్స్…ఇలా ఐదు టీమ్స్ పాల్గొననున్నాయి. ఈ…
  • చిలకా ప్రొడక్ష‌న్స్ థ్రిల్ల‌ర్ ‘మరీచిక’ 29న వరల్డ్ వైడ్‌గా మూవీ గ్రాండ్ రిలీజ్‌..
    నేష‌న‌ల్ అవార్డ్ విన్నింగ్ డైరెక్ట‌ర్‌ సతీష్ కాసెట్టి తన కొత్త థ్రిల్లర్ మూవీ ‘మరీచిక’తో మరోసారి తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకోవడానికి సిద్ధమయ్యారు. వైవిధ్యమైన , ఆలోచింపజేసే కథలను చూపడంలో ప్రత్యేక గుర్తింపు పొందిన డైరెక్టర్ మరోసారి తనదైన శైలిలో ఈసారి కూడా…
  • తెలంగాణలో 25 ఏళ్ల తర్వాత ఎస్ఐఆర్
    తెలంగాణలో వచ్చే నెల 15 నుంచి ఓటర్ల జాబితా సమగ్ర సవరణ ప్రక్రియ ప్రారంభమవుతుందని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్‌ రెడ్డి వెల్లడించారు. SIR ప్రక్రియకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. జూన్‌ 25 నుంచి జులై 24 వరకు అధికారులు,…
  • విశాఖ జిల్లా మాడుగులలోగ్యాస్ కష్టాలు!
    విశాఖ జిల్లా మాడుగులలో వంట గ్యాస్ కష్టాలు వర్ణనాతీతంగా మారాయి. డిజిటల్ భారత్ పేరుతో బుకింగ్ ప్రక్రియను సులభతరం చేశామని ప్రభుత్వం చెబుతున్నా, క్షేత్రస్థాయిలో మాత్రం వినియోగదారులకు గ్యాస్ సరఫరా కావడంలేదు. మాడుగులలో గ్యాస్ బుక్ చేసిన వెంటనే వినియోగదారుల మొబైల్…
  • తన పనితీరుతో ఆకట్టుకుంటున్న సీఎం విజయ్‌..
    తమిళనాట చారిత్రాత్మక విజయంతో రికార్డ్‌ సృష్టించిన సీఎం విజయ్‌..తనదైన పనితీరుతో ఆకట్టుకుంటున్నారు. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన నాటి నుంచే తన క్రమశిక్షణ, సమయపాలన అధికారుల్లో చర్చనీయాంశంగా మారాయి. ఓ సాధారణ ప్రభుత్వ ఉద్యోగిలా సచివాలయంలో విధులకు హాజరవుతుండటంపై హర్షం వ్యక్తం…

మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Advertisements

You may also like

Our Visitor

014136
Total views : 79139

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.