భూపాలపల్లి జిల్లాలో బట్టబయలైన ఇసుక మాఫియా బండారం. పలుగుల ఇసుక క్వారీలో మాఫియా ఆగడాలు సామాన్యులకు వణుకు పుట్టిస్తున్నాయి. టీజీఎండీసీ అధికారుల కనుసన్నల్లోనే డబ్బులు వసూళ్లు జరుగుతున్నాయన్న ఆరోపణలు జోరుగా వినిపిస్తున్నాయి. ఆ ఆరోపణలకు తగినట్లుగానే సీవీఆర్ న్యూస్ కెమెరాకు ఆ దృశ్యాలు చిక్కాయి.
ఇసుక అదనపు బకెట్‌కు వ్యాపారులు 2వేల రూపాయలు అదనంగా వసూలు చేస్తున్నారు. వాస్తవానికి ఉచితంగా లారీలో లోడ్ చేయాల్సి ఉండగా ఒక లారీ లోడింగ్‌కు 4వేల రూపాయల చొప్పున వసూలు చేస్తున్నారు. క్వారీ యాజమాన్యం ప్రభుత్వ ఖజానాకు భారీగా గండి కొడుతోంది. వ్యాపారులకు టీజీఎండీసీ అధికారులు, సిబ్బంది వత్తాసు పలుకుతున్నారన్న ఆరోపణలు జోరుగా వినిపిస్తున్నాయి.
మరోవైపు వే బిల్ కాంటాల్లో తక్కువ బరువు చూపుతూ అదనంగా మరో రెండు వందల రూపాయలు వసూలు చేస్తున్నారు. భూపాలపల్లి జిల్లా వ్యాప్తంగా ఒకే క్వారీ నడవడంతో క్వారీ నిర్వాహకులు, అధికారుల అండదండలతో అందినకాడికి దోపిడీకి పాల్పడుతున్నారు.
ఈ దందాకు సంబంధించి సీవీఆర్ న్యూస్‌కు ఎక్స్‌క్లూజివ్ విజువల్స్ దొరికాయి. సంబంధిత అధికారులు స్పందించి క్వారీ యాజమాన్యంపై టీజీఎండీసీ అధికారులపై, సిబ్బంది పై చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు.
FOLLOW US ON : FACE BOOK, INSTAGARAM, YOU TUBE, GOOGLE NEWS
- జోహార్ కామ్రేడ్ … సీతారాం ఏచూరిఒక మనిషి 72 ఏళ్ళు బతికితే 50 ఏళ్ళు ఒక సిద్ధాంతాన్ని నమ్ముకుని ఒకే పార్టీలో పనిచేయడం మాటలా? అదీ పొద్దు తిరుగుడు పూల వనాన్ని మరిపించే నేటి రాజకీయాలలో ఊసర వెల్లుల మధ్య ఆలా బతకడం అంటే…
- కోచింగ్ సెంటర్లను కంట్రోల్లో పెడ్తంపోటీ పరీక్షల కోచింగ్ సెంటర్లు, నీట్, ఎంసెట్‌లాంటి ప్రవేశ పరీక్షలకు శిక్షణనిచ్చే సంస్థలపై కేంద్ర ప్రభుత్వం రూపొందించిన మార్గదర్శకాలను రాష్ట్రంలో అమలు చేస్తామని ఐటీ, పరిశ్రమల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు వెల్లడించారు. పోటీ పరీక్షల కోచింగ్ సెంటర్లు,…
- వయోవృదులందరికి ఆయుష్మాన్ భారత్ ఆరోగ్య భీమాదేశంలో ఉన్న 70 ఏళ్లు పైబడిన వయోవృదులందరికి ఆయుష్మాన్ భారత్ ఆరోగ్య భీమా పథకాన్ని వర్తింపజేయాలని కేంద్ర క్యాబినెట్ నిర్ణయించింది. ఈ నిర్ణయంతో దేశవ్యాప్తంగా ఉన్న సుమారు 6 కోట్ల మంది సీనియర్ సిటిజన్లకు లబ్ది చేకూరుతుంది. వీరందరికీ…
- బెంగుళూరు రేవ్ పార్టీ కేసులో మరో సంచలనంబెంగళూరు రేవ్ పార్టీ కేసులో మరో సంచలన పరిణామం చోటుచేసుకుంది. తాజాగా నటి హేమ రేవ్ పార్టీలో పాల్గొన్నారని, డ్రగ్స్ సేవించారని బెంగళూరు పోలీసులు స్టేట్మెంట్ ఇచ్చారు. ఆమె ఎండీఎంఏ డ్రగ్‌ను తీసుకున్నట్లుగా ఆధారాలను సేకరించి అందుకు సంబంధించిన…
- అత్యుత్తమ దేశాల జాబితాలో టాప్ లో స్విట్జర్లాండ్ప్రపంచ దేశాలలో అత్యుత్తమ దేశంగా ‘స్విట్జర్లాండ్’ మరోసారి నిలిచింది. బెస్ట్ కంట్రీస్ ర్యాంకింగ్స్ లో వరుసగా మూడోసారి నెంబర్ వన్ స్థానాన్ని నిలబెట్టుకుంది. అందమైన పర్యాటక ప్రాంతాలతో పాటు జీవన ప్రమాణం, నాణ్యత, సంస్కృతి తదితర అంశాల ఆధారంగా…
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి