ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో ప్రపంచ బ్యాంకు ప్రతినిధులు భేటీ అయ్యారు. ప్రపంచ స్థాయి రాజధానిగా అమరావతి నిర్మాణంలో ఎలా ముందుకెళ్తుందనే దానిపై వరల్డ్ బ్యాంక్ ప్రతినిధులకు సీఎం వివరించారు. ప్రపంచంలోని ఉత్తమ ప్రమాణాలు, ఆధునిక టెక్నాలజీని ఉపయోగించుకుని అమరావతి నిర్మాణం చేపడుతున్నట్లు సీఎం చంద్రబాబు వివరించారు. కాగా నలుగురు సభ్యులతో కూడిన ప్రపంచ బ్యాంకు ప్రతినిధుల బృందం గత రెండు రోజులుగా అమరావతిలో పర్యటించింది. ఈ బృందంలో వరల్డ్ బ్యాంక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సీనియర్ స్పెషలిస్ట్ రఘు కేశవన్, లీడ్ ట్రాన్స్పోర్ట్ స్పెషలిస్ట్ గెరాల్డ్ పాల్ అలీవియర్, సీనియర్ అర్బన్ స్పెషలిస్ట్ కింగ్ యున్ షెన్, సౌత్ ఏషియా అర్బన్ ప్రాక్టీస్ మేనేజర్ అబేదాలిరజాక్ ఎఫ్.ఖలీల్ ఉన్నారు. మూడు రోజుల పర్యటనలో భాగంగా విజయవాడ వచ్చిన ప్రపంచ బ్యాంక్ బృందం సీఆర్డీయే ప్రధాన కార్యాలయంలో అధికారులతో సమావేశమయ్యారు. సీఆర్డీయే గురించి అమరావతి ప్రాజెక్టు ప్రస్తుత పరిస్థితి గురించి అధికారులు బృందానికి వివరించారు. అమరావతిలో క్షేత్ర స్థాయిలో పర్యటించి నిర్మాణంలో ఉన్న భవనాలను పరిశీలించారు. రెండో రోజు రాజధానిలోని రోడ్లను, కొండవీటి వాగు ఎత్తిపోతల పంప్ హౌస్ ను పనులను పరిశీలించడంతో పాటు విట్, ఎస్ఆర్ఎం, ఎయిమ్స్‌లను పరిశీలించారు.
FOLLOW US ON : FACE BOOK, INSTAGARAM, YOU TUBE, GOOGLE NEWS
- నీట్ నిరసన సెగ హైదరాబాద్ కు తగిలింది.నీట్ నిరసన సెగ హైదరాబాద్ కు తగిలింది. నాంపల్లి పరిసర ప్రాంతాలు బీజేపీ, కాంగ్రెస్ పార్టీల నాయకులు నిరసనలతో హొరెత్తాయి. లోక్‌సభ ప్రతి పక్ష నాయకుడు రాహుల్‌గాంధీ అరెస్ట్ తో పాటు కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా…
- జనరిక్ మెడిసిన్ దిగుమతులపై ట్రంప్ కీలక ప్రకటన.జనరిక్ ఔషధాల దిగుమతులపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక ప్రకటన చేశారు. ఆగస్టు 1 నుంచి జనరిక్ ఔషధాలపై సుంకాలు ఉండబోవని ప్రకటించారు. అమెరికాలోకి దిగుమతి అయ్యే అన్ని జనరిక్ ఔషధాలకు సున్నా శాతం సుంకం వర్తిస్తుందని..రెండేళ్ల పాటు ఇది…
- సి.వి.రావును కలిసిన సినీ నిర్మాత, కాంగ్రెస్ నేత బండ్ల గణేష్.ప్రముఖ సినీ నిర్మాత, తెలంగాణ కాంగ్రెస్ నాయకుడు బండ్ల గణేష్ ఈరోజు ఇమేజ్ హాస్పిటళ్లు, సీవీఆర్ ఛానళ్ల ఛైర్మన్ సి.వి.రావును మర్యాదపూర్వకంగా కలిశారు. హైదరాబాద్‌లోని సీవీఆర్ న్యూస్ కార్యాలయానికి వచ్చిన బండ్ల గణేష్… తన కుమార్తె వివాహానికి హాజరుకావాలని కోరారు. చైర్మన్…
- రాహుల్ గాంధీని అరెస్టు చేయడాన్ని నిరసిస్తూ ఆందోళన.ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద నిరసన తెలుపుతున్న NSUI నాయకులు, విద్యార్థులపై పోలీసులు లాఠీఛార్జ్ చేయడాన్ని మరియు వారికి మద్దతుగా వెళ్లిన రాహుల్ గాంధీని అరెస్టు చేయడాన్ని నిరసిస్తూ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలో తీవ్ర నిరసన వ్యక్తమైంది. NSUI జాతీయ…
- మెయిన్ వాపస్ ఆవుంగా’ విజయోత్సవం – ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలిపిన ఇమ్తియాజ్ అలీ.హిందీ చిత్రం ‘మెయిన్ వాపస్ ఆవుంగా’ దేశవ్యాప్తంగా ప్రేక్షకుల ఆదరణతో విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. విడుదలై ఆరు వారాలు పూర్తయినా ఈ సినిమా ఇంకా మంచి వసూళ్లతో దూసుకెళ్తోంది. ప్రస్తుతం భారతదేశంలో 450కు పైగా షోలతో పాటు విదేశాల్లోని 10 దేశాల్లో కూడా…
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి





Total views : 223753