కృత్రిమ మేథ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్-ఏఐను అందిపుచ్చుకుని రాష్ట్రాన్ని శరవేగంగా అభివృద్ధి చేయాలన్న సంకల్పంతో ఉన్నట్టు మంత్రి నారా లోకేశ్ పేర్కొన్నారు. ‘వై 2కే’ బూమ్ నేపథ్యంలో హైదరాబాద్, బెంగళూరు నగరాల్లో ఐటీ రంగం అభివృద్ధి చెందిందని తెలిపారు. అదేవిధంగా ఏఐతో ఏపీని అభివృద్ధి పథంలో పరుగులు పెట్టించవచ్చని చెప్పారు. అమెరికా పర్యటనలో ఉన్న నారా లోకేశ్.. శాన్‌ఫ్రాన్సిస్కోలోని పారిశ్రామికవేత్తలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా లోకేశ్ మాట్లాడుతూ ఏపీలో పెట్టుబడులకు ఉన్న అనుకూలతలు, ప్రభుత్వం అమలు చేస్తున్న ఇన్వెస్టర్స్ ఫ్రెండ్లీ విధానాలను వివరించారు.
భారత్‌లో రాబోయే 25 ఏళ్లలో విప్లవాత్మకమైన మార్పులు చోటుచేసుకుంటాయని తెలిపారు. ఏఐ వినియోగం ద్వారా ప్రజలకు వేగవంతమైన, మెరుగైన, పారదర్శకమైన పాలనను అందించేందుకు కృషి చేస్తున్నట్టు చెప్పారు. నాలుగోసారి ముఖ్యమంత్రిగా చంద్రబాబు బాధ్యతలు చేపట్టాక తమలాంటి యువ నాయకత్వాన్ని మరింత ప్రోత్సహిస్తున్నట్టు తెలిపారు. చంద్రబాబు మంత్రి వర్గంలో 17 మంది కొత్తవారే ఉన్నారన్నారు. విభజిత ఏపీలో ఉత్పాదకరంగం, సంప్రదాయేతర ఇంధనోత్పత్తి, బయో ఎనర్జీ, ఆక్వా, పెట్రో కెమికల్ రంగాల్లో పెట్టుబడులకు
FOLLOW US ON : FACE BOOK, INSTAGARAM, YOU TUBE, GOOGLE NEWS
- ఐఐటి ఫలితాలలో విశ్వభారతి విజయకేతనం.ఐఐటి ఫలితాలలో కృష్ణాజిల్లా గుడివాడ విశ్వభారతి విద్యాసంస్థలు విజయకేతనం ఎగురవేశాయి. ఆల్ ఇండియా సెకండ్ ర్యాంక్ సాధించిన తోట సాయి వినీల్ కు పాఠశాల చైర్మన్ పొట్లూరి శ్రీమన్నారాయణ శుభాకాంక్షలు తెలియజేశారు. తమ పాఠశాలలో ఎనిమిదవ తరగతి నుండి పదవ తరగతి…
- హైదరాబాద్ ఉప్పల్ లో కాంగ్రెస్ నేత దౌర్జన్యం.హైదరాబాద్ ఉప్పల్ లో అమానవీయ ఘటన వెలుగుచూసింది. చిన్నారులు ఇంటి ముందు క్రికెట్ ఆడారని అధికార పార్టీ నాయకుడు పిల్లల తల్లిదండ్రుల పట్ల అమానుషంగా ప్రవర్తించిన ఘటన వీడియో వైరల్ అయింది. తల్లిదండ్రులపై దాడి చేయడమే కాకుండా తన అధికార బలంతో…
- జనసేన అధినేత పవన్‌కల్యాణ్ సంచలన నిర్ణయం.ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కీలక నిర్ణయం తీసుకున్నారు, సేనా గళం పేరుతో కొత్త కమిటీ ఏర్పాటు చేశారు.అమరావతిలో జనసేన ముఖ్య నేతలతో సమావేశమయ్యారు పవన్ కళ్యాణ్. వివిధ అంశాలపై చర్చించారు. అనంతరం సేనా గళం పేరుతో…
- అమెరికాలో ఓ భారత సంతతి కుటుంబంలో విషాదం.అమెరికాలో ఓ భారత సంతతి కుటుంబంలో పెళ్లి సంబరాలు విషాదంగా మారాయి. వివాహం జరిగిన కొద్ది గంటల్లోనే వరుడు హెలికాప్టర్ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోవడంతో ఇరు కుటుంబాలు శోకసంద్రంలో మునిగిపోయాయి. జార్జియాలో జరిగిన ఈ ఘటన తీవ్ర విషాదాన్ని నింపింది. కేరళ…
- శ్రీశైలం మహాక్షేత్రంలో భక్తుల సందడి..నంద్యాల జిల్లా శ్రీశైలం మహాక్షేత్రంలో భక్తులు సందడి నెలకొంది. వేసవి సెలవులు కావడంతో భక్తులు భ్రమరాంబ మల్లికార్జున స్వామి అమ్మవార్ల దర్శనానికి పోటెత్తారు. క్యూలైన్లన్నీ భక్తులతో నిండిపోయాయి. భక్తుల రద్దీ అధికంగా ఉండటంతో అలంకార దర్శనానికి అనుమతినిచ్చారు. ముందుగా ఆన్లైన్లో బుక్…
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి




Total views : 91068