Saturday, September 12, 2026
News Navigation
Saturday, September 12, 2026
News Navigation

Breaking

Saturday, September 12, 2026
Home Telangana మనసు చంపుకొని హైడ్రా పనులు మొదలు పెట్టాం

మనసు చంపుకొని హైడ్రా పనులు మొదలు పెట్టాం

by Rama
మనసు చంపుకొని హైడ్రా పనులు మొదలు పెట్టాం

ప్రజా ఉదమ్యంగా చెరువుల పునరుద్ధరణ చేపడతామని హైడ్రా కమిషనర్ రంగనాథ్ స్పష్టం చేశారు. హైడ్రా చర్యలు తీసుకోవడంతోనే ఎఫ్ టీఎల్, బఫర్ జోన్లపై ప్రజల్లో చర్చ జరిగి అవగాహన పెరిగిందన్నారు. ఎఫ్ టీఎల్ లో ఉన్న నిర్మాణాలన్నీ కూల్చివేసి చెరువులను పరిరక్షించడం హైడ్రా ఉద్ధేశం కాదన్నారు. ఇప్పటికే ఎఫ్ టీఎల్ పరిధిలో నివాసం ఉంటున్న వారి ఇళ్లను కూల్చే ప్రసక్తే లేదన్నారు. ఇప్పటివరకూ చాలా ఆక్రమణలు జరిగాయని, ఇకపై వాటి పరిధిలో కొత్త నిర్మాణాలు జరగకుండా చూడటమే ప్రభుత్వ ఉద్ధేశం. ఇప్పటివరకూ తప్పుడు అనుమతులు ఇచ్చినవి, అనుమతులు రద్దు చేసిన ఇళ్లను మాత్రమే కూల్చివేశామన్నారు. పేదలవైనా, పెద్దలవైనా అనుమతులు లేకుంటే కూల్చివేశామని, ఈ క్రమంలో తాము మానవత్వ కోణంలో ఆలోచిస్తే సమాజానికి నష్టం జరుగుతుందన్నారు. మనసు చంపుకొని కూల్చివేతలు చేపట్టామన్నారు. చెరువుల పై ఇప్పటికే నాలుగు వేలకుపైగా ఫిర్యాదులు అందాయన్నారు. స్థానికుల భాగస్వామ్యంతో రక్షిస్తామని రంగనాథ్ స్పష్టం చేశారు.

FOLLOW US ON : FACE BOOKINSTAGARAMYOU TUBE, GOOGLE NEWS

  • ప్యారడైజ్ నా కెరీర్‌లోనే ఎక్కువ కష్టపడి చేసిన సినిమా.
    ప్యారడైజ్ నా కెరీర్‌లోనే ఎక్కువ కష్టపడి చేసిన సినిమా. సెప్టెంబర్ 24న వస్తున్నాం. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అడ్రినలిన్ పంపింగ్ హై ఎక్స్‌పీరియన్స్ ఇస్తుంది. సినిమా అంతా హైలెట్‌గా ఉంటుంది: ప్రెస్ మీట్‌లో న్యాచురల్ స్టార్ నాని న్యాచురల్ స్టార్…
  • ఆర్మీ వెపన్స్‌ చోరీ కేసులో షాకింగ్‌ ట్విస్ట్‌.
    బొల్లారం మిలటరీ కంపౌండ్ మద్రాసు రెజిమెంట్ యూనిట్ నుంచి మిస్సింగ్ అయిన గన్స్ చోరీ వెనకాల 12 ఏళ్ల పాటు మిలటరీలో పని చేసి బయటికి వచ్చిన ఓ ఉద్యోగి ప్రధాన సూత్రధారిగా ఉన్నట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. ఈ కేసు…
  • కొండా సురేఖకు బుజ్జగింపులు.
    తెలంగాణ కాంగ్రెస్ రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇంఛార్జి మీనాక్షి నటరాజన్, మాజీ మంత్రి కొండా సురేఖకు ఫోన్ చేసి మాట్లాడారు. ఇటీవల పార్టీలో, రాష్ట్ర రాజకీయాల్లో చోటుచేసుకున్న పరిణామాలపై మీనాక్షి నటరాజన్ ఆరా తీసినట్లు తెలుస్తోంది.…
  • ఫసల్ బీమా యోజన అమలుపై పాయల్ శంకర్ నిరసన.
    తెలంగాణ అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో ఫసల్ బీమా యోజన అమలుపై బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్ వినూత్న నిరసన చేపట్టారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజనను తెలంగాణలో కూడా అమలు చేయాలంటూ ట్రాక్టర్ ర్యాలీ నిర్వహించారు.…
  • ఏపీ ఉద్యోగులకు ప్రభుత్వం గుడ్‌న్యూస్‌.
    ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ ఉద్యోగులు, పింఛనుదారులకు ప్రభుత్వం తీపికబురు చెప్పింది. రెండు డీఏలను విడుదల చేస్తూ ఆర్థిక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. పెంచిన డీఏలను సెప్టెంబరు నెల జీతంతో కలిపి చెల్లించాలని ఆదేశించింది. 2025 జనవరి 1 నుంచి 1.82 శాతం…

మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Advertisements

You may also like

Copyright © 2026 CVR Telugu. All Rights Reserved.

error: