ఇరాన్, అమెరికా మధ్య వార్ మరింత ముదురుతోంది. రెండు మూడు వారాల్లో అతి భీకర దాడులు జరుగుతాయని అధ్యక్షుడు ట్రంప్ ప్రకటన తర్వాత..ఇరాన్‌పై దాడుల తీవ్రతను మరింత పెంచింది అమెరికా సైన్యం.
ఇరాన్‌లోని అతి పెద్ద, కీలకమైన వంతెనపై అమెరికా ఆర్మీ దాడి చేసింది. అల్బోర్జ్ ప్రావిన్స్‌లోని బీ 1 వంతెనను టార్గెట్ చేశాయి అమెరికా బలగాలు. వంతెనపై బాంబుల వర్షం కురిపించాయి.
నేచర్ డే వేడుకల కోసం వంతెన దగ్గర భారీగా గుమిగూడారు ప్రజలు. అదే సమయంలో అమెరికా ఆర్మీ దాడి చేయడంతో 8 మంది మృతి చెందారు..90మందికి పైగా గాయాలయ్యాయి. ఇరాన్‌లోని ఈ అతిపెద్ద వంతెనను కూల్చింది తామేనని ప్రకటించారు అమెరికా అధ్యక్షుడు ట్రంప్. ఈ దాడికి సంబంధించిన విజువల్స్‌ను ట్రంప్ తన ‘ట్రూత్ సోషల్’ ఖాతాలో పోస్ట్ చేశారు. “ఇరాన్‌లో అతిపెద్ద వంతెన కూలిపోయిందని.. దాన్ని మళ్లీ ఉపయోగించలేరని వెల్లడించారు..త్వరలో మరింత భీకర దాడులు జరగబోతున్నాయన్న యూఎస్ ప్రెసిడెంట్..”ఇంకా సమయం మించిపోకముందే ఇరాన్ ఒక ఒప్పందానికి రావాలని హెచ్చరించారు.
వంతెనపై బాంబుల వర్షం కురిపించిన అమెరికా సైన్యం..
227
previous post