Saturday, August 15, 2026
News Navigation
Saturday, August 15, 2026
News Navigation

Breaking

Saturday, August 15, 2026
Home Sports కోల్‌కతా నైట్ రైడర్స్ ఎట్టకేలకు తొలి విజయం..

కోల్‌కతా నైట్ రైడర్స్ ఎట్టకేలకు తొలి విజయం..

by CVR NEWS

ఐపీఎల్ 2026లో కోల్‌కతా నైట్ రైడర్స్ ఎట్టకేలకు తొలి విజయాన్ని నమోదు చేసింది. సొంతగడ్డపై రాజస్థాన్ రాయల్స్‌ను చిత్తు చేసింది. ఉత్కంఠభరితంగా సాగిన ఈ మ్యాచులో కేకేఆర్ 4 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఆర్ ఆర్ నిర్దేశించిన 156 పరుగుల లక్ష్యాన్ని 19.4 ఓవర్లలోనే కేకేఆర్ బ్యాటర్లు ఛేదించారు. 6 వికెట్లు కోల్పోయి 161 పరుగులు చేశారు. టాపార్టర్ విఫలమైనప్పటికీ.. స్టార్ బ్యాటర్ రింకు సింగ్ హాఫ్ సెంచరీతో చెలరేగి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. అనుకుల్ రాయ్ తో కలిసి ఏడో వికెట్‌కు 37 బంతుల్లోనే 76 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు.కేకేఆర్ బౌలర్లు అద్భుత ప్రదర్శన చేసి ఆర్ఆర్‌ను స్వల్ప స్కోరుకే పరిమితం చేశారు. అలవోకగా లక్ష్యాన్ని బాదేయొచ్చు అనుకుంటున్న తరుణంలో టాపార్డర్ ఘోరంగా విఫలమైంది.

Advertisements

You may also like

Copyright © 2026 CVR Telugu. All Rights Reserved.

error: