Saturday, August 15, 2026
News Navigation
Saturday, August 15, 2026
News Navigation

Breaking

Saturday, August 15, 2026
Home Film దర్శకుడు క్రిష్ జగర్లమూడి చేత ‘వాలీ’ టైటిల్ మోషన్ పోస్టర్ ఆవిష్కరణ..

దర్శకుడు క్రిష్ జగర్లమూడి చేత ‘వాలీ’ టైటిల్ మోషన్ పోస్టర్ ఆవిష్కరణ..

by CVR NEWS

ఫైర్‌వాటర్ ఎంటర్‌టైన్‌మెంట్స్ స్పోర్ట్స్ డ్రామా ‘వాలి’ ఫస్ట్‌లుక్‌ అండ్‌ మోషన్‌ పోస్టర్‌కు అనూహ్య స్పందన

టాలీవుడ్‌లో మొట్టమొదటి వాలీబాల్ నేపథ్యంలోని స్పోర్ట్స్ డ్రామా ‘వాలీ’ (VOLLEY) తన టైటిల్‌ను ఆసక్తికరమైన మోషన్ పోస్టర్ ద్వారా అధికారికంగా విడుదల చేసింది. ఈ మోషన్ పోస్టర్‌ను ప్రముఖ దర్శకుడు క్రిష్ జగర్లమూడి తన అధికారిక ఎక్స్ (ట్విట్టర్) ఖాతా ద్వారా విడుదల చేయగా, సినీ అభిమానులు మరియు పరిశ్రమ వర్గాల్లో మంచి స్పందన లభిస్తోంది.

జి విక్రమ్ రెడ్డి సమర్పణలో ఫైర్‌వాటర్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై రూపొందుతున్న ఈ చిత్రానికి దిలీప్ కె. మనుకొండ దర్శకత్వం వహిస్తున్నారు. తీరప్రాంత గ్రామీణ నేపథ్యంలో సాగనున్న ఈ సినిమా, ఇద్దరు అన్నదమ్ముల జీవితాలను కేంద్రీకరించి, వాలీబాల్ క్రీడలోని తీవ్ర పోటీ, భావోద్వేగాలు, మరియు మానవ సంబంధాల్ని ప్రతిబింబిస్తుంది.

ఈ చిత్రంతో రోనిత్ జీఆర్‌జీ హీరోగా పరిచయం అవుతున్నాఉడు. ఇదే చిత్రంతో పరిచయం కాబోతున్న నిపుణ్‌ సత్య ఈ చిత్రంలో ముఖ్య పాత్రను చేస్తున్నాడు. ఈ చిత్రంలో అభిగ్న్య వుత్తలూరు హీరోయిన్‌గా నటిస్తోంది. రవి వర్మ, కల్పలత, వడ్లమాని శ్రీనివాస్, లక్ష్మణ్ మీశాల, కిరణ్ వరణాసి, రమణ భార్గవ తదితరులు ముఖ్య పాత్రల్లో నటిస్తూ బలమైన నటీనటుల సమూహాన్ని అందిస్తున్నారు.

ఈ చిత్రాన్ని జి రోహన్ రెడ్డి నిర్మిస్తుండగా, శ్రీనివాస్ కారంకి సహ నిర్మాతగా, స్నేహ దాసరి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌గా వ్యవహరిస్తున్నారు. కథ, స్క్రీన్‌ప్లేలను దిలీప్ కె. మనుకొండ మరియు పవన్ కె. విప్పర్తి సంయుక్తంగా రచించారు.

సాంకేతిక విభాగంలో అరుణ్ విజేకే సినిమాటోగ్రఫీ అందించగా, ఔరానోవా స్టూడియోస్ సంగీతాన్ని సమకూర్చింది. ఎడిటింగ్‌ను రవితేజ గిరిజాల నిర్వహిస్తున్నారు.

ఆంధ్రప్రదేశ్‌లోని ఉప్పాడ మరియు పరిసర ప్రాంతాల్లో అందమైన లొకేషన్లలో చిత్రీకరణ పూర్తయ్యింది. ప్రస్తుతం ఈ చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉంది.

టైటిల్ రివీల్‌తో పాటు మోషన్ పోస్టర్‌కు లభిస్తున్న మంచి స్పందనతో ‘వాలీ’ శక్తివంతమైన స్పోర్ట్స్ డ్రామాగా రూపుదిద్దుకుంటోందనే అంచనాలు పెరుగుతున్నాయి. త్వరలోనే ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని అప్‌డేట్స్‌ను ఫైర్‌వాటర్ ఎంటర్‌టైన్‌మెంట్స్ ప్రకటించనుంది.

Advertisements

You may also like

Copyright © 2026 CVR Telugu. All Rights Reserved.

error: