Saturday, August 15, 2026
News Navigation
Saturday, August 15, 2026
News Navigation

Breaking

Saturday, August 15, 2026
Home Latest News టపాసుల తయారు ఫ్యాక్టరీలో భారీ పేలుడు, 18 మంది మృతి..!

టపాసుల తయారు ఫ్యాక్టరీలో భారీ పేలుడు, 18 మంది మృతి..!

by CVR NEWS

తమిళనాడులో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. విరుద్‌నగర్‌ జిల్లాలోని కట్టనార్‌పట్టిలో ఉన్న బాణసంచా పరిశ్రమలో ఆదివారం పేలుడు సంభవించింది. ఈ ఘటనలో 18 మంది చనిపోగా…. మరికొందరు తీవ్రంగా గాయపడినట్లు తెలిసింది. మృతుల సంఖ్య మరింతగా పెరిగే ప్రమాదం ఉందని సమాచారం. భారీ పేలుడుతో ఆ చుట్టుపక్కల పరిసర ప్రాంతాలు కంపించినట్లు తెలిసింది. దీంతో స్థానికులు భయపడిపోయారు. సమాచారం అందుకున్న వెంటనే ఘటనాస్థలికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది .. సహాయక చర్యలు చేపట్టారు. మరోవైపు ఈ ఘటనపై తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్‌ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సహాయక చర్యలను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు.

Advertisements

You may also like

Copyright © 2026 CVR Telugu. All Rights Reserved.

error: