Friday, July 10, 2026
News Navigation
Friday, July 10, 2026
News Navigation

Breaking

Friday, July 10, 2026
Home Latest News భారత్‌కు అమెరికా మెగా రక్షణ ప్యాకేజీ..

భారత్‌కు అమెరికా మెగా రక్షణ ప్యాకేజీ..

by CVR NEWS
భారత్‌కు అమెరికా మెగా రక్షణ ప్యాకేజీ

భారత్‌-అమెరిక మధ్య మెగా రక్షణ ప్యాకేజీ డీల్ కుదిరింది. భారత సైన్యానికి చెందిన అత్యాధునిక అపాచీ అటాక్ హెలికాప్టర్లు, ‘M777’ ఆల్ట్రా-లైట్ హోవిట్జర్ ఫిరంగుల సహాయక సేవలు, రక్షణ పరికరాల సరఫరా కోసం సుమారు 428 మిలియన్ డాలర్ల ఒప్పందానికి అమెరికా విదేశాంగ శాఖ ఆమోదం తెలిపింది. ఇండో-పసిఫిక్, దక్షిణాసియా ప్రాంతాలలో రాజకీయ స్థిరత్వం, శాంతికి ప్రధాన భాగస్వామిగా ఉన్న భారత్‌తో వ్యూహాత్మక సంబంధాలను బలోపేతం చేసుకోవడానికి ఈ డీల్ దోహదపడుతుందని అమెరికా పేర్కొంది. ఇందులో భాగంగా AH-64E అపాచీ హెలికాప్టర్ల దీర్ఘకాలిక నిర్వహణ, లాజిస్టిక్స్ సేవల కోసం 198.2 మిలియన్ డాలర్లను కేటాయించగా, దీనికి బోయింగ్, లాక్‌హీడ్ మార్టిన్ సంస్థలు కాంట్రాక్టర్లుగా వ్యవహరిస్తాయి.
మరోవైపు సరిహద్దుల్లో అత్యంత కీలకమైన ‘M777A2’ హోవిట్జర్ ఫిరంగుల విడిభాగాలు, మరమ్మతులు, సాంకేతిక సహాయం, శిక్షణ కొరకు 230 మిలియన్ డాలర్ల ఒప్పందం కుదిరింది. దీనికి BAE సిస్టమ్స్ కాంట్రాక్టర్‌గా ఉంటుంది. ఈ అత్యాధునిక సేవలు, పరికరాలను తమ సాయుధ దళాల్లో విలీనం చేసుకోవడం భారతదేశానికి చాలా సులువైన విషయమని అమెరికా ప్రశంసించింది. ఈ మెగా రక్షణ ఒప్పందం ద్వారా భారత్ ప్రస్తుత, భవిష్యత్ ప్రాంతీయ ముప్పులను మరింత సమర్థవంతంగా ఎదుర్కొని, తన దేశీయ రక్షణ వ్యవస్థను బలోపేతం చేసుకోగలదని వైట్ హౌస్ స్పష్టం చేసింది.

Advertisements

You may also like

Our Visitor

039375
Total views : 196554

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.

error: