Friday, July 10, 2026
News Navigation
Friday, July 10, 2026
News Navigation

Breaking

Friday, July 10, 2026
Home Crime 44వ జాతీయ రహదారిపై భారీ అగ్నిప్రమాదం..

44వ జాతీయ రహదారిపై భారీ అగ్నిప్రమాదం..

by CVR NEWS
44వ జాతీయ రహదారిపై భారీ అగ్నిప్రమాదం

మెదక్ జిల్లాలో ఘోర అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. తూప్రాన్ పరిధిలోని 44వ జాతీయ రహదారిపై వెళ్తున్న ఒక భారీ కంటైనర్‌లో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. ఒక ప్రముఖ ఆటోమొబైల్ కంపెనీకి చెందిన కొత్త కార్లను హైదరాబాద్ నుంచి షోరూమ్‌కు తరలిస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. తూప్రాన్ సమీపానికి రాగానే కంటైనర్ వెనుక భాగం నుంచి ఒక్కసారిగా దట్టమైన పొగలు, మంటలు వ్యాపించాయి. డ్రైవర్ గమనించి వాహనాన్ని ఆపేలోపే మంటలు కంటైనర్ మొత్తం విస్తరించాయి. ఈ ప్రమాదంలో కంటైనర్‌లో ఉన్న ఎనిమిది కొత్త కార్లు పూర్తిగా కాలి బూడిదయ్యాయి. హైవేపై మంటలు భారీగా ఎగసిపడుతుండటంతో ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం కలిగింది. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపు చేసారు.

Advertisements

You may also like

Our Visitor

039390
Total views : 196622

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.

error: