Friday, July 17, 2026
News Navigation
Friday, July 17, 2026
News Navigation

Breaking

Friday, July 17, 2026
Home Andhra Pradesh రాష్ట్ర ప్రభుత్వం క్రీడల అభివృద్ధికి చిత్తశుద్ధితో పనిచేస్తోందన్న మంత్రి రాంప్రసాద్ రెడ్డి ..

రాష్ట్ర ప్రభుత్వం క్రీడల అభివృద్ధికి చిత్తశుద్ధితో పనిచేస్తోందన్న మంత్రి రాంప్రసాద్ రెడ్డి ..

by CVR NEWS
రాష్ట్ర ప్రభుత్వం క్రీడల అభివృద్ధికి చిత్తశుద్ధితో పనిచేస్తోందన్న మంత్రి రాంప్రసాద్ రెడ్డి

రాష్ట్ర ప్రభుత్వం క్రీడల అభివృద్ధికి పూర్తి చిత్తశుద్ధితో పనిచేస్తోందని క్రీడల , రవాణా శాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డి అన్నారు. స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఆధ్వర్యంలో గోపాలపట్నం ఇండోర్ స్టేడియంలో నిర్వహించిన వేసవి శిక్షణా శిబిరం ముగింపు కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే గణబాబు, జిల్లా కలెక్టర్ అభిషిక్త్ కిషోర్ కూడా పాల్గొన్నారు. ముందుగా క్రీడాకారులను అభినందించి ప్రోత్సాహకాలు అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు క్రీడాకారులను ప్రోత్సహిస్తూ రాష్ట్రాన్ని రోల్ మోడల్‌గా తీర్చిదిద్దుతున్నారని తెలిపారు. నెల రోజుల శిక్షణ శిబిరాల ద్వారా వేలాది క్రీడాకారులను తీర్చిదిద్దుతున్నామని చెప్పారు. క్రీడలలో 3 శాతం రిజర్వేషన్ వల్ల అనేక మంది విద్యతో పాటు ఉద్యోగాలు పొందుతున్నారని పేర్కొన్నారు.

Advertisements

You may also like

Our Visitor

040865
Total views : 212245

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.

error: