24
పెద్దపల్లి జిల్లా పెద్దపల్లి మండలం రంగాపూర్ గ్రామంలోని ఒక ఇటుక బట్టీలో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. మట్టి లోడుతో వెళ్తున్న టిప్పర్ డంపింగ్ చేసే సమయంలో 11 కేవీ విద్యుత్ లైన్‌ను తాకడంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో టిప్పర్ పూర్తిగా దగ్ధమైంది. ఇటుక బట్టీలో పనిచేస్తున్న కార్మికులు వెంటనే మంటలను ఆర్పేందుకు ప్రయత్నించినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగకపోవడంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు.”.




Total views : 90427