Friday, July 17, 2026
News Navigation
Friday, July 17, 2026
News Navigation

Breaking

Friday, July 17, 2026
Home Telangana అప్పులు కావు,మీ వ్యాపారాలకు పెట్టుబడులు.

అప్పులు కావు,మీ వ్యాపారాలకు పెట్టుబడులు.

by CVR NEWS
అప్పులు కావు,మీ వ్యాపారాలకు పెట్టుబడులు- ఎమ్మెల్యే శ్రీ గణేష్..

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో ప్రజా పాలన-ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణ ద్వారా అభివృద్ధి పథంలో దూసుకుపోతోందని కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీగణేష్ అన్నారు. కంటోన్మెంట్ నియోజకవర్గ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ సభ్యులకు ప్రభుత్వ సహకారంతో బ్యాంకుల ద్వారా మంజూరైన 2 కోట్ల 7 లక్షల 50 వేల రూపాయల రుణ చెక్కులను ఎమ్మెల్యే శ్రీగణేష్ లబ్ధిదారులకు అందజేశారు. కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయాలన్న సీఎం రేవంత్ రెడ్డి మహా సంకల్పానికి కంటోన్మెంట్ నుండి శ్రీకారం చుడుతున్నామని, ఈ రుణాలు అప్పులు కావు – ఆడబిడ్డల ఆత్మగౌరవానికి సీఎం ఇస్తున్న పెట్టుబడులన్నారు. వీటిని ఇంటి ఖర్చులకు కాకుండా వ్యాపార సామ్రాజ్యాలు నిర్మించడానికి వినియోగించాలని, సహాయం తీసుకునే స్థాయి నుండి సహాయం చేసే స్థాయికి ఎదగాలన్నారు. పన్నులు కట్టే శక్తిగా మహిళలు ఎదగాలని ఇదే ముఖ్యమంత్రి విజన్ అని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలను వ్యాపారవేత్తలు గా తీర్చి దిద్దే లక్ష్యంతో ముందుకు సాగుతోందన్నారు.. ప్రభుత్వం ఆడబిడ్డలకు అందిస్తున్న చీరెల పంపిణీ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే గణేశ్ ప్రారంభించారు. ఇది కేవలం చీర కాదు – తెలంగాణ ఆడబిడ్డలపై కాంగ్రెస్ ప్రభుత్వానికి ఉన్న గౌరవానికి, ప్రేమకు నిదర్శనం అని ఎమ్మెల్యే అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి గారి పాలనలో ప్రతి పథకం పారదర్శకంగా, ప్రతి రూపాయి లబ్ధిదారుడికి చేరుతోందన్నారు. కంటోన్మెంట్ నుండి కోటీశ్వరులైన మహిళలను తయారు చేసి సీఎం ముందు నిలబెడతామని ఎమ్మెల్యే శ్రీగణేష్ అన్నారు.

Advertisements

You may also like

Our Visitor

040924
Total views : 212396

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.

error: