నల్లగొండ జిల్లా డిండి మండలం ఎర్రగుంటపల్లి సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది .ఈ ప్రమాదంలో గొర్రెల కాపరి ఒకరు మృతి చెందగా, సుమారు 300 గొర్రెలు ప్రాణాలు కోల్పోయాయి. వరుసగా వెళ్తున్న మూడు డీసీఎం వాహనాలు ఒకదానికొకటి వెనుక నుంచి ఢీకొనడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. మృతుడు నాగర్‌కర్నూల్ జిల్లా కొల్లాపూర్ నియోజకవర్గంలోని కోడేరు మండల కేంద్రానికి చెందిన ఎగ్గెంశెట్టి ఎల్లయ్యగా గుర్తించారు. ఎల్లయ్య తన భార్య, పిల్లలుతో కలిసి గొర్రెలతో డీసీఎం వ్యాన్ లో వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది .ఆంధ్రప్రదేశ్ ప్రాంతంలో గొర్రెలను మేపించి తిరిగి స్వగ్రామానికి మూడు డీసీఎంలలో తరలిస్తున్నారు .ఈ సందర్భంగా కురుమ సంఘం తరఫున తక్షణ సాయంగా రూ.1 లక్ష ఆర్థిక సహాయం అందజేస్తున్నట్లు రాష్ట్ర అధ్యక్షుడు ఎగ్గె మల్లేష్ ప్రకటించారు. అలాగే బాధిత కుటుంబానికి ప్రభుత్వం నుంచి సాధ్యమైనంత మేరకు సహాయం అందేలా చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యేలు బాలునాయక్, బీర్ల ఐలయ్య గొర్రెలు ,మేకల పెంపకదారుల సహకార సంస్థ చైర్‌పర్సన్ సరిత హామీ ఇచ్చారు.
నల్లగొండ జిల్లా, డిండి మండలం, ఎర్రగుంటపల్లి సమీపంలో రోడ్డు ప్రమాదం.
11
previous post




Total views : 92164