Saturday, August 15, 2026
News Navigation
Saturday, August 15, 2026
News Navigation

Breaking

Saturday, August 15, 2026
Home Andhra Pradesh యోగాంధ్ర 2026లో భాగంగా విజయవాడలో నిత్య యోగా.

యోగాంధ్ర 2026లో భాగంగా విజయవాడలో నిత్య యోగా.

by CVR NEWS
యోగాంధ్ర 2026లో భాగంగా విజయవాడలో నిత్య యోగా

యోగాంధ్ర 2026లో భాగంగా విజయవాడ అర్బన్ పరిధిలోని BRTS రోడ్డు వద్ద అగ్నిమాపక, విపత్తు స్పందన అధికారుల థీమ్‌తో జరిగిన యోగా కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ డాక్టర్ లక్ష్మిశా పాల్గొన్నారు. అధికారులతో కలిసి యోగాసనాలు అభ్యసించారు. ఈ నెల 21న అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని జిల్లా వ్యాప్తంగా అర్బన్, గ్రామీణ పరిధిలో యోగాసనాల అవగాహన, శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు. యోగాను తమ జీవితంలో భాగం చేసుకుని శారీరక ఆరోగ్యంతో పాటు మానసిక ఆరోగ్యాన్ని సొంతం చేసుకోవాలని కలెక్టర్ డాక్టర్ లక్ష్మిశా తెలిపారు. సుసంపన్న, ఆరోగ్య , ఆనంద ఆంధ్ర స్వర్ణాంధ్ర లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాల్లో ప్రజలు పెద్ద ఎత్తున భాగస్వాములు కావాలని కోరారు.

Advertisements

You may also like

Copyright © 2026 CVR Telugu. All Rights Reserved.

error: