77
శ్రీశైలం మహాక్షేత్రంలో భక్తులు సందడి నెలకొంది. వరుసగా సెలవులు రావడంతో అధిక సంఖ్యలో భక్తులు ఆలయాన్ని సందర్శిస్తున్నారు. శ్రీశైల భ్రమరాంబ మల్లికార్జున స్వామి అమ్మవార్ల దర్శనానికి భారీగా తరలివస్తున్నారు. క్యూలైన్లన్నీ భక్తులతో నిండిపోయాయి. భక్తుల రద్దీ దృష్ట్యా స్వామి వారి అలంకార దర్శనానికి మాత్రమే అనుమతి ఇస్తున్నారు. ముందుగానే ఆన్‌లైన్‌లో స్పర్శ దర్సనం టికెట్స్ తీసుకున్న వారికి యధావిధిగా స్పర్శ దర్శనానికి అనుమతిస్తున్నారు. భక్తులు వేకువజామున నుంచే పాతాళగంగలో పుణ్యస్నానాలు ఆచరించి స్వామి అమ్మవార్ల దర్శనార్థమై క్యూలైన్లలో బారులు తీరారు. దర్శనానికి 4 గంటల సమయం పడుతుంది. క్యూలైన్లలో భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలుగకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.




Total views : 149943