88
వేసవి సెలవుల అనంతరం తెలంగాణ వ్యాప్తంగా ఇవాళ స్కూళ్లు రీ ఓపెన్ అయ్యాయి. తొలిరోజే అమావాస్య కావడంతో విద్యార్థుల హాజరు శాతం మందకొడిగా ఉంది. రాష్ట్రవ్యాప్తంగా దాదాపు అన్ని పాఠశాలల్లోనూ ఇదే పరిస్థితి కనిపించింది. అమావాస్య సెంటిమెంట్ కారణంగా తొలిరోజున విద్యార్థులను స్కూళ్లకు పంపించేందుకు తల్లిదండ్రులు సుముఖత వ్యక్తం చేయలేదు. చాలామంది తల్లిదండ్రులు మంచి రోజు చూసి పిల్లలను పంపుతామని చెబుతున్నారు. దీంతో తరగతి గదులు ఖాళీగా కనిపించాయి. కొన్ని ప్రైవేట్ స్కూళ్లు తమ అకాడమిక్ సంవత్సరాన్ని బుధవారం నుంచి ప్రారంభిస్తున్నట్లు సమాచారం. ఇవాళ అమావాస్య, రేపు మంగళవారం కావడంతో… విద్యార్థుల హాజరు శాతం తక్కువగా ఉంటుందని ఆ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.




Total views : 202959