Monday, July 13, 2026
News Navigation
Monday, July 13, 2026
News Navigation

Breaking

Monday, July 13, 2026
Home Latest News నాగర్‌కర్నూల్ జిల్లా కొల్లాపూర్‌లో కలెక్టర్ హేమంత కేశవ్ పర్యటన.

నాగర్‌కర్నూల్ జిల్లా కొల్లాపూర్‌లో కలెక్టర్ హేమంత కేశవ్ పర్యటన.

by CVR NEWS
నాగర్‌కర్నూల్ జిల్లా కొల్లాపూర్‌లో కలెక్టర్ హేమంత కేశవ్ పర్యటన

నాగర్‌కర్నూల్ జిల్లా కొల్లాపూర్‌లో కలెక్టర్ హేమంత కేశవ్ పాటిల్ ఆకస్మికంగా పర్యటించారు. మున్సిపాలిటీ పరిధిలో జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల పురోగతిని సమీక్షించారు. పారిశుద్ధ్య పనుల్లో నిమగ్నమైన కార్మికులతో మాట్లాడి వారి ఆరోగ్య పరిస్థితులు తెలుసుకున్నారు. కార్మికులకు అవసరమైన భద్రతా పరికరాలు, మాస్కులు తదితర రక్షణ సామగ్రి ఇవ్వాలని అధికారులకు సూచించారు. విధుల నిర్వహణలో ఎదురవుతున్న ఇబ్బందులు, సిబ్బంది కొరత, పరికరాల లభ్యత వంటి అంశాలపై కార్మికుల నుంచి అభిప్రాయాలు తెలుసుకున్నారు. పారిశుద్ధ్య కార్మికుల సంక్షేమాన్ని అత్యంత ప్రాధాన్యంగా తీసుకోవాలని… వారి భద్రతకు ఎలాంటి లోటు లేకుండా చూడాలని మున్సిపల్ అధికారులకు సూచించారు.

Advertisements

You may also like

Our Visitor

040016
Total views : 202952

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.

error: