జీ 7 సమ్మిట్ సందర్భంగా భారత ప్రధాని నరేంద్ర మోదీతో, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భేటీ అయ్యారు. ఇద్దరు నేతల మధ్య 16 నెలల తర్వాత జరిగిన మొదటి ఫేస్-టు-ఫేస్ భేటీ ఇది. రెండు దేశాల మధ్య వాణిజ్యం, ఇన్వెస్ట్‌మెంట్లు, శక్తి భద్రత, పశ్చిమాసియా స్థిరత్వం వంటి కీలక అంశాలపై ఇద్దరు నేతలు చర్చించారు. ఈ సమావేశం భారత్-అమెరికా సంబంధాలను మరింత బలోపేతం చేసే దిశగా ముందుకు సాగుతుందని భావిస్తున్నారు. ఈ సందర్భంగా భారత్‌కు అండగా ఉంటామని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ హామీ ఇచ్చారు. మోదీ తమకు ఆప్తమిత్రుడు అని, ఇరు దేశాల మధ్య త్వరలో ట్రేడ్ డీల్ జరగబోతోందని ట్రంప్ స్పష్టం చేశారు. భారత్ భారీగా పెట్టుబడులు పెట్టబోతున్నామని ట్రంప్ వెల్లడించారు.
మరోవైపు హర్మూజ్ జలసంధి వద్ద ఎలాంటి ఆంక్షలు ఉండొద్దని, అక్కడ స్వేచ్ఛా వాణిజ్యం జరగాలని అన్నారు ప్రధాని మోదీ. అక్కడ వేలాది మంది భారత నావికుల భద్రతే తమకు ముఖ్యమని, వారికి రక్షణ కల్పించాల్సిన అవసరం ఉందని తెలిపారు. పశ్చిమాసియాలో శాంతి కోసం ట్రంప్ కృషి చేశారని, హర్మూజ్ తెరవడంతో ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు మేలు జరిగిందన్నారు. ఇరు దేశాల మధ్య త్వరలో వాణిజ్య ఒప్పందం జరగనుందని మోదీ చెప్పారు.




Total views : 146770