Wednesday, September 23, 2026
News Navigation
Wednesday, September 23, 2026
News Navigation

Breaking

Wednesday, September 23, 2026
Home Latest News ఏపీ హైకోర్డులో రఘురామకృష్ణంరాజు కస్టోడియల్ టార్చర్ కేసు విచారణ.

ఏపీ హైకోర్డులో రఘురామకృష్ణంరాజు కస్టోడియల్ టార్చర్ కేసు విచారణ.

by CVR NEWS
ఏపీ హైకోర్డులో రఘురామకృష్ణంరాజు కస్టోడియల్ టార్చర్ కేసు విచారణ

ఏపీ హైకోర్టు మాజీ ఎంపీ కనుమూరి రఘురామకృష్ణరాజు కస్టోడియల్ టార్చర్ కేసులో నిందితుడైన ఐపీఎస్ అధికారి ఎం. సునీల్ కుమార్ నాయక్ ముందస్తు బెయిల్ పిటిషన్‌పై విచారణను జూలై 3, 2026కి వాయిదా వేసింది. అప్పటివరకు ఆయనకు మధ్యంతర రక్షణ కల్పించిన న్యాయస్థానం, దర్యాప్తునకు సహకరించాలని ఆదేశించింది. ఒక పార్లమెంట్ సభ్యుడిని కస్టడీలో హింసించడం ప్రజాస్వామ్య వ్యవస్థపై దాడితో సమానమని కోర్టు వ్యాఖ్యానించింది. పార్లమెంటుపై దాడి చేసిన వారికి, ఎంపీని టార్చర్ చేసిన వారికి పెద్దగా తేడా లేదని పేర్కొంటూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఐపీఎస్ అధికారి సునీల్ నాయక్ ముందుగా లొంగిపోవడం మంచిదని హైకోర్టు సూచించింది. ఎంపీపై జరిగిన కస్టోడియల్ టార్చర్ ఆరోపణలు చాలా తీవ్రమైనవని అభిప్రాయపడింది. విచారణ సందర్భంగా.. ఐపీఎస్ అధికారి సునీల్ నాయక్ ముందస్తు బెయిల్ పిటిషన్‌పై నిర్ణయాన్ని వాయిదా వేస్తూ, తదుపరి విచారణను జూలై 3, 2026కి చేపడుతున్నట్లు కోర్టు ప్రకటించింది. అంతవరకు ఆయనకు మధ్యంతర రక్షణ కొనసాగుతుందని స్పష్టం చేసింది.

Advertisements

You may also like

Copyright © 2026 CVR Telugu. All Rights Reserved.

error: