Tuesday, June 30, 2026
News Navigation
Tuesday, June 30, 2026
News Navigation

Breaking

Tuesday, June 30, 2026
Home Andhra Pradesh మార్కాపురం జిల్లా కిష్టంశెట్టిపల్లిలో డిజిటల్ సర్వే సెంటర్ ప్రారంభం.

మార్కాపురం జిల్లా కిష్టంశెట్టిపల్లిలో డిజిటల్ సర్వే సెంటర్ ప్రారంభం.

by CVR NEWS
మార్కాపురం జిల్లా కిష్టంశెట్టిపల్లిలో డిజిటల్ సర్వే సెంటర్ ప్రారంభం

మార్కాపురం జిల్లాలోని గిద్దలూరు మండలం కిష్టంశెట్టిపల్లిలో సంజీవని డిజిటల్ నెర్వ్ సెంటర్‌ను సీఎం చంద్రబాబు నాయుడు ప్రారంభించారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేస్తున్నామన్నారు. అన్నదాతలకు అండగా నిలుస్తున్నామని.. ఏటా రైతులకు 20 వేల రూపాయలు ఇస్తున్నామని చెప్పారు. మనసున్న ప్రభుత్వం కాబట్టే ప్రజలకు అన్నీ చేస్తున్నామని వెల్లడించారు.
ప్రతి ఒక్కరి ఆరోగ్యం కోసం సంజీవని వంటి వినూత్న కార్యక్రమాలు అమలు చేస్తున్నామని సీఎం చంద్రబాబు తెలిపారు. ఆగస్టు 15 నుంచి రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో సంజీవని కార్యక్రమాన్ని విస్తరిస్తామని చెప్పారు. యోగా, ధ్యానం వంటి మంచి అలవాట్లు అలవరచుకోవాలని, పిల్లలకు పౌష్టికాహారం అందించాలని సూచించారు. జంక్ ఫుడ్‌కు దూరంగా ఉండాలని, ఎరువుల వినియోగాన్ని తగ్గించి ప్రకృతి సేద్యం వైపు రైతులు అడుగులు వేయాలని పిలుపునిచ్చారు. రాష్ట్రంలో ఇప్పటికే 20 లక్షల మంది రైతులు ప్రకృతి సేద్యం చేస్తున్నారని వెల్లడించారు.

Advertisements

You may also like

Leave a Comment

Our Visitor

035846
Total views : 180323

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.