Saturday, August 15, 2026
News Navigation
Saturday, August 15, 2026
News Navigation

Breaking

Saturday, August 15, 2026
Home Andhra Pradesh గోదావరి వరదల సన్నద్ధతపై మంత్రి తుమ్మల సమీక్ష.

గోదావరి వరదల సన్నద్ధతపై మంత్రి తుమ్మల సమీక్ష.

by CVR NEWS
గోదావరి వరదల సన్నద్ధతపై మంత్రి తుమ్మల సమీక్ష

గోదావరి వరదల నేపథ్యంలో ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా అన్ని శాఖలు సమన్వయంతో ముందస్తు జాగ్రత్త చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. గోదావరి పరివాహక ప్రాంతంలో భాగమైన భద్రాచలం, పినపాక నియోజకవర్గాల్లో వరదల పట్ల జిల్లా యంత్రాంగాన్ని సన్నద్ధంగా ఉండాలని చెప్పారు. గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని అన్ని ప్రభుత్వ శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. వరదల సమయంలో బూర్గంపాడు, అశ్వాపురం ప్రాంతాలు అధికంగా ప్రభావితం అవుతాయని..అందుకు అనుగుణంగా అప్రమత్తంగా ఉండాలన్నారు. వరదల వల్ల రహదారులు బ్లాక్ అయ్యే గ్రామాలను గుర్తించాలని అన్నారు. అత్యవసర వైద్య సేవలు, నిత్యావసర వస్తువులు, రవాణాకు అడ్డంకులు లేకుండా యాక్షన్ ప్లాన్ ఉండాలని మంత్రి తుమ్మల అధికారులను ఆదేశించారు.

Advertisements

You may also like

Copyright © 2026 CVR Telugu. All Rights Reserved.

error: