184
గత ప్రభుత్వం ఉద్యోగులకు జీతాలు, మధ్యాహ్న భోజనం డైట్ బిల్లులు, సర్పంచ్‌ల బిల్లుల బకాయిలు కూడా చెల్లించలేదని రేవంత్ ఆగ్రహం వ్యక్తం చేశారు. బిల్లులన్నింటినీ పెండింగ్‌లో పెట్టింది కేసీఆర్ అయితే, ఆ బద్నాం మరియు నిందలను మాత్రం ఇప్పుడు తాను మోయాల్సి వస్తోందన్నారు. గత పాలకుల విపరీతమైన అప్పుల కారణంగా ఢిల్లీలో సైతం తెలంగాణ పరువు పోయే పరిస్థితి దాపురించిందని విమర్శించారు.
లక్ష కోట్ల ప్రజాధనంతో కట్టిన కాళేశ్వరం కేవలం మూడేళ్లకే కూలిపోయి ‘కూలేశ్వరం’గా మారిందని రేవంత్ రెడ్డి విమర్శించారు.