Thursday, July 9, 2026
News Navigation
Thursday, July 9, 2026
News Navigation

Breaking

Thursday, July 9, 2026
Home Latest News వరంగల్ : క్లినిక్‌లు నిర్వహిస్తున్న అర్హత లేని వైద్యులు.

వరంగల్ : క్లినిక్‌లు నిర్వహిస్తున్న అర్హత లేని వైద్యులు.

by CVR NEWS
వరంగల్ : క్లినిక్‌లు నిర్వహిస్తున్న అర్హత లేని వైద్యులు

ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతూ, అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకొని కాసులు కురిపించుకుంటున్న అగాపే హోలిస్టిక్ క్లినిక్ బాగోతం వెలుగులోకి వచ్చింది. చట్టబద్ధమైన వైద్య అర్హతలు లేకుండానే, డాక్టర్ బోర్డు తగిలించుకోకుండానే గుట్టుచప్పుడు కాకుండా సాగుతున్న ఈ నకిలీ వైద్య దందాపై స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వరంగల్ నగర కేంద్రంగా సుబ్రమణ్యం అనే వ్యక్తి ఎలాంటి సర్టిఫికేట్లు, రిజిస్ట్రేషన్లు లేకుండా అగాపే హోలిస్టిక్ క్లినిక్ పేరుతో పెద్ద ఎత్తున వైద్య సేవలు నిర్వహిస్తున్నాడు. కైరోప్రాక్టిక్, ఆక్యుపంచర్, ఫిజియోథెరపీ, స్పైన్ థెరపీ, హోలిస్టిక్ మెడిసిన్ అంటూ రకరకాల పేర్లతో హైటెక్ వైద్యం ముసుగులో అమాయక ప్రజల నుంచి అందినకాడికి దోచుకుంటున్నాడు. వరంగల్‌తో పాటు ఖమ్మం జిల్లాలో కూడా బ్రాంచీలు ఏర్పాటు చేసి ఈ నకిలీ సామ్రాజ్యాన్ని విస్తరించడం చూస్తుంటే ఇతని వెనుక ఉన్న శక్తులెవరో అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఒక క్లినిక్ నడపాలంటే సంబంధిత వైద్య మండళ్లు, ఆరోగ్య శాఖ అనుమతులు తప్పనిసరి. కానీ ఈ క్లినిక్‌కు ఎలాంటి ప్రభుత్వ పర్మిషన్లు లేవని సమాచారం. పేరుకు ముందు డాక్టర్ అని వేసుకోకపోయినా.. లోపల మాత్రం రోగులకు హై-లెవల్ ట్రీట్‌మెంట్లు ఇస్తూ చట్టాన్ని పక్కదారి పట్టిస్తున్నాడు. సరైన డిగ్రీ, కనీస అర్హత లేకుండా స్పైన్ థెరపీ లాంటి సున్నితమైన వైద్యం చేయడం రోగుల ప్రాణాలకే ప్రమాదకరమని నిపుణులు హెచ్చరిస్తున్నారు. నగరం నడిబొడ్డున ఇంతపెద్ద దందా సాగుతున్నా జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడం వెనుక మతలబు ఏంటని స్థానికులు నిలదీస్తున్నారు. ఇప్పటివరకు ఈ క్లినిక్‌పై ఎలాంటి విచారణ జరపకపోవడం, చర్యలు తీసుకోకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. అమాయక రోగుల ప్రాణాలను పణంగా పెట్టి వ్యాపారం చేస్తున్న ఈ అగాపే హోలిస్టిక్ క్లినిక్‌పై ఉన్నతాధికారులు తక్షణమే స్పందించి, సమగ్ర విచారణ జరిపి సదరు వ్యక్తిపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని బాధితులు, స్థానిక ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. అధికారుల విచారణ అనంతరమే ఈ దందా వెనుక ఉన్న మరిన్ని వాస్తవాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది.

Advertisements

You may also like

Leave a Comment

Our Visitor

038927
Total views : 192928

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.

error: