Tuesday, July 21, 2026
News Navigation
Tuesday, July 21, 2026
News Navigation

Breaking

Tuesday, July 21, 2026
Home Latest News గజ్వేల్ బీజేపీలో రాజుకున్న అసంతృప్తి సెగలు.

గజ్వేల్ బీజేపీలో రాజుకున్న అసంతృప్తి సెగలు.

by CVR NEWS
గజ్వేల్ బీజేపీలో రాజుకున్న అసంతృప్తి సెగలు

సిద్దిపేట జిల్లా గజ్వేల్ బీజేపీలో అసంతృప్తి బహిర్గతమైంది. తాజాగా ప్రకటించిన జిల్లా కార్యవర్గ కమిటీలో గజ్వేల్ నియోజకవర్గానికి తగిన ప్రాధాన్యత దక్కలేదంటూ పార్టీ నాయకులు, కార్యకర్తలు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గజ్వేల్‌లో నిర్వహించిన నియోజకవర్గ కార్యవర్గ సమావేశంలో పలువురు నేతలు తమ అభిప్రాయాలను వెల్లడించారు. గత నాలుగు సంవత్సరాలుగా పార్టీ బలోపేతానికి కష్టపడి పనిచేసినా జిల్లా కమిటీలో గుర్తింపు లభించలేదని పేర్కొన్నారు. ఎమ్మెల్యే, పార్లమెంట్ ఎన్నికల్లో పార్టీకి గణనీయమైన ఓట్లు సాధించడంలో తమ పాత్ర ఉందని గుర్తు చేశారు. ఈ నేపథ్యంలో ఇకపై జిల్లా కమిటీతో కాకుండా నేరుగా రాష్ట్ర కమిటీతోనే కలిసి పనిచేయాలని నిర్ణయించినట్లు ప్రకటించారు. నియోజకవర్గానికి చెందిన 68 మంది సభ్యుల కమిటీ జాబితాను రాష్ట్ర నాయకత్వానికి పంపినట్లు తెలిపారు.

Advertisements

You may also like

Leave a Comment

Our Visitor

042041
Total views : 221448

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.

error: