3.1K
పార్లమెంట్ సమావేశాల సందర్భంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా లోక్‌సభకు హాజరై ప్రతిపక్షం లేవనెత్తిన అంశాలపై సమాధానం ఇవ్వాలని డిమాండ్ చేస్తూ కాంగ్రెస్ ఎంపీలు న్యూఢిల్లీలోని పార్లమెంట్ హౌస్ వద్ద నిరసన చేపట్టారు. ఈ ఆందోళనలో తెలంగాణకు చెందిన ఎంపీ డాక్టర్ మల్లు రవి కూడా పాల్గొన్నారు. హోంమంత్రి గైర్హాజరును ప్రశ్నిస్తూ ప్లకార్డులు ప్రదర్శించిన ఎంపీలు, ప్రజలకు సంబంధించిన కీలక జాతీయ అంశాలపై ప్రభుత్వం పార్లమెంట్‌లోనే వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశారు. భారీ వర్షం కురుస్తున్నప్పటికీ నిరసన కొనసాగిస్తూ, పార్లమెంటరీ సంప్రదాయాలు, ప్రజాస్వామ్య జవాబుదారీతనాన్ని కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని కాంగ్రెస్ సభ్యులు పేర్కొన్నారు.