Thursday, August 20, 2026
News Navigation
Thursday, August 20, 2026
News Navigation

Breaking

Thursday, August 20, 2026
Home Political షరతులతో బెయిల్ మంజూరు చేసిన తెలంగాణ హైకోర్టు.

షరతులతో బెయిల్ మంజూరు చేసిన తెలంగాణ హైకోర్టు.

by CVR NEWS

మాజీ మావోయిస్టు నేత, తెలంగాణ ఉద్యమకారుడు గాదె ఇన్నయ్యకు తెలంగాణ హైకోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. ఎన్ఐఏ నమోదు చేసిన కేసులో చంచల్‌గూడ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న ఆయనకు రూ.25 వేల అదనపు పూచీకత్తుతో రెండు షూరిటీ బాండ్లు సమర్పించాలని ధర్మాసనం ఆదేశించింది. అలాగే బెయిల్ కాలంలో ప్రతి శుక్రవారం కూకట్‌పల్లి పోలీస్ స్టేషన్‌లో విచారణాధికారి ఎదుట తప్పనిసరిగా హాజరుకావాలని షరతు విధించింది.

మావోయిస్టు భావజాలాన్ని ప్రచారం చేశారనే ఆరోపణలతో ఎన్ఐఏ గాదె ఇన్నయ్యపై యూఏపీఏ చట్టం కింద కేసు నమోదు చేసి గత ఏడాది డిసెంబర్ 21న అరెస్టు చేసింది. ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టు నేత వికల్ప్ అంత్యక్రియల సందర్భంగా చేసిన ప్రసంగం మావోయిస్టు భావజాలాన్ని ప్రోత్సహించేలా ఉందని ఎన్ఐఏ అభియోగాలు మోపింది. ఈ కేసులో తాజాగా హైకోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది.

Advertisements

You may also like

Leave a Comment

Copyright © 2026 CVR Telugu. All Rights Reserved.

error: