101
“ఆంధ్రుల ఆత్మగౌరవానికి ప్రతీక అమరావతి అన్నారు సీఎం చంద్రబాబు. దీన్ని అంగుళం కూడా కదల్చడం ఎవరితరం కాదన్నారు. ఐదేళ్ల విధ్వంసానికి చరమగీతం పాడుతూ, అసెంబ్లీ సాక్షిగా చేసిన తీర్మానం.. ఇవాళ పార్లమెంటులో చట్టబద్ధత బిల్లు రూపం దాల్చిందన్నారు. నెల్లూరు జిల్లా వింజమూరు ‘ప్రజావేదిక’ సభలో ప్రసంగించిన చంద్రబాబు.. గత ప్రభుత్వ ‘మూడు ముక్కలాట’ రాజకీయాలకు కాలం చెల్లిందన్నారు. అమరావతి ఏకైక రాజధానిగా రికార్డుల్లోకెక్కడం ఖాయమని ఆయన స్పష్టం చేశారు. రాష్ట్ర భవిష్యత్తును అంధకారంలోకి నెట్టిన శక్తులకు ప్రజలే బుద్ధి చెప్పారని, ఇప్పుడు సుపరిపాలన శకం మొదలైందని ధీమా వ్యక్తం చేశారు.





Total views : 78942