Wednesday, July 22, 2026
News Navigation
Wednesday, July 22, 2026
News Navigation

Breaking

Wednesday, July 22, 2026
Home Andhra Pradesh కాసేపట్లో ప్రారంభం కానున్న ఏపీ గ్రూప్ 2 ప్రిలిమ్స్ ఎగ్జామ్

కాసేపట్లో ప్రారంభం కానున్న ఏపీ గ్రూప్ 2 ప్రిలిమ్స్ ఎగ్జామ్

by Rama
Group-2 Exam

ఏపీ గ్రూప్ 2 ప్రిలిమ్స్ ఎగ్జామ్ (AP Group 2 Prelims Exam):

ఏపీ గ్రూప్ 2 ప్రిలిమ్స్ ఎగ్జామ్ కాసేపట్లో ప్రారంభం కానుంది. ఉదయం 10:30 నుండి మధ్యాహ్నం 1 గంటల వరకు ఈ ఎగ్జామ్ జరగనుంది.. రాష్ట్ర వ్యాప్తంగా 1327 కేంద్రాల్లో గ్రూప్-2 రాత పరీక్షలు జరగనున్నాయని సీఎస్ జవహర్ రెడ్డి పేర్కొన్నారు. పరీక్షలు సజావుగా జరిగేందుకు నిరంతర పర్యవేక్షణకు 24 మంది ఐఏఎస్ అధికారులు, 450 మంది రూట్ అధికారులు, 1330 మంది లైజనింగ్ అధికారులను నియమించామని సీఎస్ పేర్కొన్నారు. అదే విధంగా 24,142 మంది ఇన్విజిలేటర్లు, మరో 8500 ఇతర సిబ్బందిని ఆయా పరీక్షా కేంద్రాల్లో నియమించామన్నారు.

Follow us on : Facebook, Instagram & YouTube.

అంతేగాక విస్తృత బందోబస్తు చర్యల్లో భాగంగా 3971 మంది పోలీసు సిబ్బందిని నియమించడంతో పాటు పరీక్షా పత్రాలు, జవాబు పత్రాలు కాన్ఫిడెన్సియల్ మెటీరియల్ నిర్దేశిత ప్రాంతాలకు సురక్షితంగా తరలించేందుకు వీలుగా 900 మంది ఎస్కార్ట్ సిబ్బందిని నియమించామని తెలిపారు. అలాగే మొత్తం పరీక్షల తీరును ఏపీపీఎస్సీ నుంచి 51 మంది అధికారులు పర్యవేక్షించనున్నారని సీఎస్ పేర్కొన్నారు. ఇక ప్రిలిమ్స్ పరీక్షకు హాజరయ్యే అభ్యర్ధులు తప్పనిసరిగా APPSC గ్రూప్ 2 అడ్మిట్ కార్డ్ మరియు చెల్లుబాటు అయ్యే ఫోటో ID ప్రూఫ్ యొక్క హార్డ్ కాపీని పరీక్ష హాల్‌కు తీసుకెళ్లాలని సూచించారు. Read Also..



నంద్యాల జిల్లా ఆత్మకూరులో పులి, పులికూనలు హల్చల్.
నంద్యాల జిల్లా, ఆత్మకూరు అటవీ డివిజన్‌లో నాలుగు పులి కూనలు హల్‌చల్ చేశాయి. నల్లకాల్వ గ్రామానికి …
అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రిలో సేవలపై ఎమ్మెల్యే సమీక్ష.
అనంతపురం నగర ప్రభుత్వ ఆసుపత్రిలో పారిశుద్ధ్యం, వైద్య సేవల మెరుగుదలపై కీలక సమీక్ష సమావేశం నిర్వహించారు. …
కోవిడ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో అప్రమత్తమైన ఏపీ ప్రభుత్వం.
రాష్ట్రంలో నమోదవుతున్న కోవిడ్ కేసుల నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం అప్రమత్తమైంది. మంత్రి సత్యకుమార్ యాదవ్ ఆదేశాల …

మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Advertisements

You may also like

Our Visitor

042274
Total views : 223710

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.

error: