నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తి అసెంబ్లీ నియోజకవర్గానికి బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా గుర్క జైపాల్ యాదవ్ రెండు సెట్ల నామినేషన్ల పత్రాలను రిటర్నింగ్ అధికారి శ్రీను నాయక్ కు దాఖలు చేశారు. అంతకుముందు కర్మన్ ఘట్ లోని కనకదుర్గ అమ్మవారి ఆలయంలో నామినేషన్ పత్రాలకు ప్రత్యేక పూజలు చేశారు. ఆ తర్వాత కల్వకుర్తిలోని అమరవీరుల స్తూపానికి తెలంగాణ తల్లి విగ్రహానికి నివాళులర్పించారు. ఈ సందర్భంగా జైపాల్ యాదవ్ మీడియాతో మాట్లాడుతూ టిఆర్ఎస్ పార్టీ అధినేత కేసిఆర్ గారు నన్ను ఆశీర్వదించి కల్వకుర్తి నియోజకవర్గం టిఆర్ఎస్ అభ్యర్థిగా టికెట్ మరియు బి ఫామ్ అందజేయడం జరిగిందని. ఆయన ప్రవేశపెట్టిన పథకాలే నన్ను గెలిపిస్తాయని కుల మతాలకు అతీతంగా కారు గుర్తు మీద ఓటు వేసి టిఆర్ఎస్ పార్టీని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు నామినేషన్ కార్యక్రమంలో రాష్ట్ర ఫుడ్ కమిషన్ చైర్మన్ గోలి శ్రీనివాస్ రెడ్డి, మిషన్ భగీరథ వైస్ చైర్మన్ ఉప్పల వెంకటేష్ పలువురు బిఆర్ఎస్ నేతలు పాల్గొన్నారు.
.
Karnool
కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు లో మాజీ కేంద్ర మంత్రి కోట్ల జయ సూర్యప్రకాష్ రెడ్డి మీడియా సమావేశంలో మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వ తీరుపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. రాష్ట్రంలో రైతు ప్రభుత్వం అంటున్నా వైసీపీ, కరువు వచ్చి రైతులు ఇబ్బంది పడుతుంటే ఈ ప్రభుత్వం ఏమి చేస్తుందన్నారు. చంద్రబాబు పై వైసీపీ కేసు పెట్టింది. టీడీపీ కుడా జగన్ పై కేసు పెడితే జగన్ తట్టుకో గలరా అన్నారు. న్యాయ వ్యవస్థ ను మ్యానేజ్ చేస్తూ సిబిఐ కేసులో జగన్ 3700 వాయిదాలు తెచ్చుకున్నాడు. జగన్ వచ్చిన కోర్టు వాయిదాలు తో గిన్నిస్ బుక్ ఎక్కోచ్చన్నారు. జిల్లా మొత్తం ను తక్షణమే కరువు జిల్లాగ ప్రకటించి ప్రతి రైతుకు ఎకరాకు 50 వేలు పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. తెలంగాణాలో కాంగ్రెస్, ఏపీ లో టీడీపీ అధికారం చేపడుతుందని కోట్ల ధీమా వ్యక్తం చేశారు.గతంలో రాజశేఖర్ రెడ్డి కొడుకని జగన్ కు ఓటు వేశారు, ఈ సారి జగన్ అధికారంలోకి వస్తే ఆంధ్రప్రదేశ్ కుడా మరో రష్యా గ మారుతుందన్నారు.
కర్నూలు జిల్లా గోనెగండ్ల మండల పరిధిలోని హెచ్ కైరవాడి గ్రామంలో కొత్తిమీర సాగు చేసిన రైతు లబోదిబోమంటున్నాడు. కొత్తిమీర పంటకు గిట్టుబాటు ధర లేక పండిన పంటను గొర్రెలను మేతగా వదిలాడు. రైతు రాముడు రెండు ఎకరాల్లో కొత్తిమీర పంటను సాగు చేసేందుకు గాను రూ 2లక్షల వరకు పెట్టుబడి పెట్టామని,ఈ పంట 40 రోజుల్లో కోతకు వస్తుందని తెలిపాడు. అదును తప్పితే, ఇక పంట ముదురుతే కొనేందుకు వ్యాపారులు రారని,దీంతో పంట లేతగా ఉన్న సమయంలోనే అమ్మకాలు జరగాలి, కాని గిట్టుబాటు ధర పలకడం లేదని రైతు ఆవేదనా వ్యక్తం చేస్తున్నాడు. కొత్తిమీరను వ్యాపారులు బెడ్లు ప్రకారం కొనుగోలు చేస్తారని, బెడ్ ప్రస్తుతం రూ.100 పలుకుతుండగ ఒక కొత్తిమీరా కట్ట రూ.5 పలుకుతూ,వ్యాపారం రూ. 10వేలు దాటడంలేదని పెట్టుబడి కూడా రావడం లేదు. కూలీలు కూడా గిట్టుబాటు కాకపోవడంతో రైతు రాముడు తాను రెండు ఎకరాల్లో సాగుచేసిన కొత్తిమీర పంటను గొర్రెలకు మేతగా వేశాడు.
తమను ప్రభుత్వమే ఆదుకోవాలని వేడుకుంటున్నాడు.
నంద్యాలలో అంతర్ జిల్లాలో బైక్ ల దొంగని పోలీసులు అరెస్టు చేశారు. మైదుకూరు, చాగలమర్రి, కోవేలకుంట్ల, కడప, ప్రొద్దుటూరులలో బైక్ లు ముద్దాయి చోరీ చేశాడు. రూ.8 లక్షల విలువగల 10 బైక్ లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పొద్దుటూరు కు చెందిన నిందితుడు దస్తగిరిని పోలీసులు అరెస్టు చేశారు. వివరాలను జిల్లా ఎస్పీ రఘువీర్ రెడ్డి మీడియా సమావేశంలో తెలియజేశారు.
Read Also..
ప్రకాశం జిల్లా మార్కాపురం సమీపంలో రోడ్డు ప్రమాదం… కడప జిల్లా కాశినాయన జడ్పీటీసి సత్యనారాయణరెడ్డికి తీవ్ర గాయాలయ్యాయి. విజయవాడ నుంచి పోరుమామిళ్ల వస్తుండగా కారు అదుపుతప్పి బోల్తాపడటంతో ప్రమాదం జరిగింది. ఒంగోలులోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. హుటాహుటిన ఎమ్మెల్సీ గోవిందరెడ్డి, వైసీపీ నాయకులు బయలుదేరారు. సంఘటనపై పూర్తి వివరాలు దర్యాప్తు చేస్తున్నారు.
నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తి పట్టణంలో బిజెపి అభ్యర్థి తల్లోజు ఆచారి ర్యాలీ నిర్వహించి ప్రచారం లో పాల్గొన్నారు. ఈ సారి తనకు అవకాశం ఇవ్వాలని బీజేపీ అభ్యర్థి ఆచారి కోరడం జరిగింది నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తి నియోజకవర్గం కల్వకుర్తి పట్టణ కేంద్రంలో మొదట పెద్ద ఎత్తున కార్యకర్తలతో ర్యాలీ నిర్వహించారు అనంతరం ప్రచారంలో భాగంగా ఆయన మాట్లాడుతూ గత 30 సంవత్సరాలుగా అన్ని పార్టీలకు అవకాశం కల్పించారు బిజెపి పార్టీ కూడా ఒక్కసారి అవకాశం కల్పిస్తే నియోజకవర్గానికి అభివృద్ధి పథకంలో తీసుకు వెళ్తానని కేంద్రంలో తప్పనిసరిగా నరేంద్ర మోడీ అధికారంలోకి వస్తారని తనను గెలిపిస్తే కేంద్ర నిధులు తీసుకువచ్చి నియోజకవర్గంలో అభివృద్ధి పనులు చేస్తానని బిజెపి అభ్యర్థి తల్లోజు ఆచారి అన్నారు కల్వకుర్తి పట్టణంలోని పలు వార్డులలో ఇంటింటి ప్రచారం నిర్వహించి ఓటర్లను కలిసి కమలం పువ్వు గుర్తుకు ఓటు వేయవలసిందిగా వేడుకున్నారు పలువురు బిజెపి పార్టీ నాయకులు పాల్గొన్నారు.





Total views : 81798