కృష్ణాజిల్లా గన్నవరం నియోజకవర్గం లో జాతీయ రహదారిపై తప్పిన పెను ప్రమాదం. గన్నవరం జాతీయ రహదారి నాలుగు రోడ్లు కూడలి వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది.
పాత గన్నవరం నుంచి విజయవాడ వెళ్లే క్రమంలో టిప్పర్ క్వారీ లారీ లోడుతో ఒక్కసారి గా జాతీయ రహదారిపై దూసుకు రాగా, ఏలూరు నుంచి విజయవాడ వెళ్లే కంటైనర్ బాక్స్ లారీ టిప్పర్ లారీని ఢీకొట్టిన వైనం జాతీయ రహదారిపై విజయవాడ నుంచి ఏలూరు వైపు వెళ్లే మూడు లారీలు వరుసగా టిప్పర్ తప్పించబోయి రోడ్డు మధ్యలో ఉన్న రైలింగ్ పై దూసుకు వెళ్ళాయి. తెల్లవారు జాము కావడంతో జాతీయ రహదారిపై జనసంచారం లేకపోవడంతో తప్పిన పెను ప్రమాదం. హైవే పెట్రోలింగ్ సిబ్బంది సహాయంతో ట్రాఫిక్‌కు అంతరాయం కలగకుండా సహాయక చర్యలు చేపట్టిన గన్నవరం పోలీసులు.
Krishana
కృష్ణాజిల్లా గన్నవరం నియోజకవర్గం లో అగ్నిప్రమాదంలో దగ్ధమైన ఆటోమొబైల్ షాపు
గన్నవరం లోని స్థానిక సినిమా థియేటర్స్ సెంటర్ వద్ద షాపింగ్ కాంప్లెక్స్ లలో ప్రమాదవశాత్తు ఆటోమొబైల్ షాపులో ఈ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. శ్రీ శ్రీనివాస ఆటోమొబైల్ షాపు యజమాని మడతల గురువారెడ్డి గా గుర్తింపు. గన్నవరం బీట్ పోలీసుల సహాయంతో సమాచారం అందుకున్న గన్నవరం అగ్నిమాపక సిబ్బంది సంఘటన స్థలాన్ని చేరుకుని మంటలను అదుపు చేశారు. పూర్తిగా దగ్ధమైన ఆటోమొబైల్ షాపులోని స్పేర్ పార్ట్స్ సామాన్లు. అర్ధరాత్రి కావడంతో మూసివేసిన ఆటోమొబైల్ షాప్ లో ఒక్కసారిగా మంటలు చెలరాగడంతో ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదు. సంఘటన స్థలానికి చేరుకున్న గన్నవరం పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు.
కృష్ణా జిల్లా గన్నవరం నియోజకవర్గంలో ప్రమాదవశాత్తు సావరగూడెం చెరువులో పడి గల్లంతై ఇద్దరు యువకులు మృతి చెందారు. స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న గన్నవరం పోలీసులు సంఘటనా స్థలికి చేరుకొని వివరాలు సేకరించారు. మృతులు విజయవాడ పటమట కు చెందిన వారిగా గుర్తించారు. ఆదివారం సెలవు దినం కావడంతో సరదాగా ఈత కోసం రావడంతో ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. విజయవాడ ఎన్ఎస్ఎమ్ లో పదో తరగతి చదువుతున్న విద్యార్థులు.. ఫోటో షూట్ నిమిత్తం సావరగూడెం శివారు కొండ చెరువు వద్దకు చేరుకున్నారు. మృతులు గుజ్జర్లపూడి అంకిత్(15), నడికుదిటి శశి వర్ధన్(14)గా గుర్తించారు.
ఈ రోజు ఆదివారం సుమారు తెల్లవారు జామున 3:30కి కచ్చితమైన సమాచారం మేరకు అవనిగడ్డ నుండి కాకినాడ కు అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యం లారీని గుడివాడ టూ-టౌన్ సి.ఐ తులసిధర్, పోలీస్ సిబ్బంది స్వాదినపరుచుకున్నారు. లారీ లో ఉన్న మొత్తం రేషన్ బియ్యం సుమారు 12 టన్నులు ఉంటుందని, కేస్ నమోదు చేసి స్వాదినపరుచుకున్న బియ్యాన్ని పిడిఎస్ డిప్యూటీ తహశీల్దార్ కి అప్పగిస్తామని తెలిపారు.
Read Also..
దివంగత ఆంధ్ర ప్రదేశ్ శాసనమండలి సభ్యురాలు హాజియా ఎం డి. కరిమున్నీసా ద్వితీయ వర్ధంతి సందర్భంగా విజయవాడ అజిత్ సింగ్ నగర్ డాబా కోట్లు సెంటర్లో కుటుంబ సభ్యులు ఆదివారం సంతాప సభ నిర్వహించి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా పేదలకు పారిశుధ్య కార్మికులకు బట్టలు, పండ్లు పంపిణీ చేశారు. సంతాప సభ అనంతరం పైపుల్ రోడ్ సెంటర్ అంబాపురం పంచాయతీ పరిధిలో దివంగత నేత కరిమున్నిసా జ్ఞాపకార్థం వారి కుమారులు ఎమ్మెల్సీ రుహుల్లా తమ సొంత నిధులు 1.70లక్షలతో మస్జిద్ కరిమున్నీసా మరియు మదర్సా నిర్మాణ పనులు లాంచనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వందల సంఖ్యలో ముస్లిం మత పెద్దలు హాజరై ప్రేత్యేక ప్రార్ధనలు చేశారు.. ముఖ్య అతిధులుగా సెంట్రల్, పశ్చిమ ఎమ్మెల్యేలు మల్లాది విష్ణు వెల్లంపల్లి శ్రీనివాస్, నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి, డిప్యూటీ మేయర్ అవుతు శైలజ, విచ్చేసి తమ సంతాపాన్ని తెలియచేసి శంకుస్థాపన కార్యక్రమాన్ని నిర్వహించారు.
విజయవాడ రూరల్ మండలం నున్న గ్రామంలో తెలుగుదేశం జనసేన పార్టీలు సంయుక్తంగా గన్నవరం నియోజకవర్గ ఇన్చార్జ్ లు తెలుగుదేశం పార్టీ యార్లగడ్డ వెంకట్రావు జనసేన పార్టీ చలమలశెట్టి రమేష్ బాబు ఆధ్వర్యంలో తెలుగుదేశం జనసేన రాష్ట్ర పార్టీ ల ఆదేశాల మేరకు వైసీపీ ప్రభుత్వంలో రోడ్ల పరిస్థితిని ప్రజలు పడుతున్న దుస్థితిని ఎండగడుతూ నిరసన కార్యక్రమం తెలియజేశారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గం లోని తెలుగుదేశం జనసేన నాయకులు కార్యకర్తలు భారీగా చేరుకున్నారు, నున్న గ్రామం నుంచి సూరంపల్లి వెళ్లే రహదారి దుస్థితిని వివరిస్తూ ప్రజలు పడుతున్న ఇబ్బందులు గురించి వైసిపి ప్రభుత్వం అరాచక పాలన గురించి విమర్శలు గుప్పించారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం రాష్ట్ర నాయకులు గుజ్జర్లపూడి బాబురావు, విజయవాడ రూరల్ మండలం తెలుగుదేశం అధ్యక్షులు కొల్లా ఆనంద్, గొడ్డళ్ళా చిన్నారావు, జనసేన జిల్లా కార్యదర్శి పొదిలి దుర్గారావు నియోజవర్గ జనసేన మహిళ నాయకురాలు మేకల స్వాతి, తెలుగుదేశం జనసేన నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
శ్రీశైలం అమ్మవారి ఆలయం వెనుక భాగంలో ఉన్న హెలిప్యాడ్ గ్రౌండ్ పక్కన ఉన్న చెక్ డ్యామ్ లో గుర్తు తెలియని మృతదేహం లభ్యమైంది. చెక్ డ్యామ్ లో నీటిపై తెలియాడుతున్న మృతదేహాన్ని బహిర్భకి వెళ్లిన స్థానికులు కొందరు గుర్తించి స్థానిక పోలీసులకు సమాచారం ఇచ్చారు. హుటాహుటిన పోలీసులు చేరుకొని మృతదేహాన్ని చెక్ డ్యామ్ నుండి పోలీసులు బయటకు తీశారు. అయితే గుర్తు తెలియని మృతదేహనికి సంబంధించి వివరాలు ప్రకారం శ్రీశైలానికి చెందిన వెంకట్ నారాయణ కుమారుడు నాగరాజు గా గుర్తింపు. గత రెండు రోజులుగా కనిపించకుండా పోయి చివరికి మిగతాజీవిగా కనిపించడంతో తల్లిదండ్రులు కన్నీరు పర్యాంతరమయ్యారు. తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసు అధికారులు విచారణ చేపట్టారు.
రాజధాని అమరావతి, పోలవరం ప్రాజెక్ట్‌లో నిప్పులు పోశారని, ఈ రెండింటిని చూస్తే ఎంతో బాధ కలుగుతోందని ఎంపీ రఘురామకృష్ణరాజు వ్యాఖ్యానించారు. చంద్రబాబు ముఖ్యమంత్రి అయితే హైదరాబాద్‌కు ధీటుగా అమరావతిని అభివృద్ధి చేయగలరని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. చంద్రబాబు లాంటి దూరదృష్టి ఉన్న నాయకుడికి ఈసారి పట్టాభిషేకం చేయాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. చంద్రబాబు ఏపీకి రెండోసారి సీఎం అయ్యి ఉంటే రాజధాని అమరావతిని అద్భుతమైన నగరంగా తీర్చిదిద్దేవారని అన్నారు.
కృష్ణా జలాల పునఃపంపిణీ పై నోటిఫికేషన్లు రద్దు చేయాలి సిపిఐ డిమాండ్ తిరుపతి జిల్లా వరదయ్యపాలెం భారత కమ్యూనిస్టు పార్టీ (సిపిఐ)ఆధ్వర్యంలో ఈనెల 20,21 వ తేదీ లో విజయవాడలో 30 గంటల నిరసన దీక్ష కార్యక్రమంలో భాగంగా వరదయ్యపాలెం మండల సిపిఐ కార్యదర్శి తరుణ్ కుమార్ ఆధ్వర్యంలో గోడ కరపత్రికలు విడుదల చేయడం జరిగింది ఈ సందర్భంగా సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యుడు సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ భావితరాల భవిష్యత్తుకే పోరుచయ కదులుదాం రండి అంటూ నినాదిస్తూ కేంద్రంలో బిజెపి విభజన చట్టంలో పొందుపరచిన తిలోదకాలు హామీలను ఇచ్చి వ్యతిరేక చర్యలకు పాల్పడుతుందన్నారు పెడరల్ స్ఫూర్తి కి విరుద్ధంగా ఆయా రాష్ట్రాలతో సంప్రదింపులు చేయకుండానే అడ్డు గోడలుగా నిర్ణయాలు చేయడానికి తక్షణ ఉపసంహరించుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.
Read Also..





Total views : 195877