విజయవాడ బెంజ్ సర్కిల్ వద్ద నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో మహిళల కోసం నిర్మించిన పింక్ టాయిలెట్‌ను నగర ప్రజాప్రతినిధులు, అధికారులు కలిసి ప్రారంభించారు. బాలింతలు తమ బిడ్డలకు పాలిచ్చేందుకు వీలుగా, మహిళలు వ్యక్తిగత అవసరాలు తీర్చుకునేందుకు అనువుగా వీటిని నిర్మించినట్లు అధికారులు వెల్లడించారు.. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా నగర మేయర్ రాయపాటి అరుణ., తూర్పు నియోజకవర్గం ఇంచార్జ్ అవినాష్ మరియు ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.
Krishana
నాగులచవితి పర్వదినాన్ని పురస్కరించుకుని మోపిదేవి గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి దేవస్థానము, భక్తులతో పోటెత్తింది,, వేలాదిగా భక్తులు తరలిరావటంతో స్వామివారి ఆలయంలో కీ లైన్లు భక్తులతో కిక్కిరిస్తాయి.. తొలియతశాసనసభ్యులు సింహాద్రి రమేష్ బాబు నాగులచవితి ఉత్సవాలను ఘనంగా ప్రారంభించినారు.. భక్తుల కోరికలు తీర్చే కల్పవల్లిగా ప్రసిద్ధి గాంచిన శ్రీ వల్లీ దేవసేనా సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని సింహాద్రి రమేష్ బాబు కుటుంబ సమేతంగా విచ్చేసినారు.. నాగులచవితి పర్వదినాన్ని పురస్కరించుకుని తొలుత ఆలయ ఆవరణలో గల నాగపుట్టలో పాలు పోసి మొక్కులు చెల్లించుకున్నారు.. అనంతరం శ్రీ స్వామి వారిని దర్శించుకొనగా, ఆలయ పండితులు వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు..
సింహాద్రి రమేష్ బాబు వారి కుటుంబ సభ్యులను ఆలయ సహాయ కమీషనర్ నల్లం సూర్య చక్రధరరావు ఆలయ మర్యాదలతో సన్మానించారు. ఆలయ ప్రాంగణంలో దీపారాధన చేశారు. నూతనంగా ఏర్పాటు చేసిన లడ్డు కౌంటర్లను ప్రారంభించినారు. మెడికల్ క్యాంపులను స్వామివారిని దర్శించుకునేందుకు వచ్చే భక్తుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేసిన ఆలయ అధికారులు.. నాగుల చవితి సందర్భంగా ఉదయం 2.30 ని”లు నుంచి భక్తులు స్వామివారి దర్శనం చేసుకునేందుకు ఏర్పాట్లు చేసిన ఆలయ అధికారులు రేపు ఉదయం 2 గంటల 30 నిమిషాలకు ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించనున్న ఆలయ అర్చకులు. నాగుల చవితి సందర్భంగా ఆలయంలో నిర్వహించే ప్రత్యేక దర్శనాలు రద్దు చేసిన ఆలయ అధికారులు స్వామివారిని దర్శించేందుకు సుమారు లక్ష మంది భక్తులు వరకు రావచ్చు అని అంచనా.. దర్శనానికి వచ్చే భక్తులు ఎటువంటి ఇబ్బందులు పడకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేసిన సహాయ కమీషనర్ నల్లం సూర్య చక్రధరరావు ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రత్యేక బందోబస్తు నిర్వహించనున్న అవనిగడ్డ సబ్ డివిజన్ పరిధి పోలీస్ వారు మరియు రెవెన్యూ సిబ్బంది మెడికల్ సిబ్బంది పంచాయతీ వారు సెక్యూరిటీ సిబ్బంది సేవాసమితి వారు వారి యొక్క సేవలను కొనసాగిస్తున్నారు.
దూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తుల కోసం విజయవాడ, గుడివాడ, మచిలీపట్నం డిపోల నుంచి ప్రత్యేక బస్సులు నడుపనున్న ఆర్టీసీ అధికారులు.
Read Also..
నేడు సీఎం వైఎస్ జగన్ ఏలూరు జిల్లా నూజివీడులో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో 2003 కు మందు అసైన్మెంట్ భూములకు హక్కు కల్పించడం, కొత్త అసైన్మెంట్ భూములకు పట్టాల పంపిణీ కార్యక్రమంలో 27.41 లక్షల ఎకరాలపై పేదలకు యాజమాన్య హక్కులు ఇవ్వనున్నారు. నిరుపేదలకు కొత్తగా 46 వేల ఎకరాల పంపిణీ జరుగనుంది. అనంతరం నూజివీడులో బహిరంగ సభలో సీఎం జగన్ ప్రసంగించనున్నారు. మధ్యాహ్నం తాడేపల్లికి తిరుగు ప్రయాణం రానున్నారు.
Read Also..
Read Also..
రాష్ట్రవ్యాప్తంగా కూరగాయ ధరలు రాకెట్ వేగంతో పరుగులు తీస్తుంటే మార్కెట్లో చికెన్ ధరలు అమాంతంగా పడిపోయాయి. కార్తీక మాసం రావడంతో గత కొన్ని రోజులుగా బహిరంగ మార్కెట్లో రూ,250,190, నడిచిన ధర నేడు 110/- రూపాయలకు పడిపోవడంతో కార్తీక మాసం కోడి “మాసం” ధరలు ఇంకా నెల రోజులు ఉండడంతో ధర ఇంకెంత క్షీణిస్తుందోనని కృష్ణాజిల్లాలో అమ్మకం దారులు ఆందోళన చెందుతున్న పరిస్థితి. కృష్ణాజిల్లాలో కార్తీకమాసం ప్రారంభం నుండి చికెన్ ధరల రేట్లు తగ్గిపోయాయి. కోళ్ల పెంపకం దారులకు గిట్టుబాటు ధర లభించక వ్యాపారం కొనసాగించలేక అయోమయంలో పడ్డారు. అమ్మకం దారులు కార్తీక మాసంతో వ్యాపారుల మధ్య పోటీ పెరగడంతో రైతులను తగ్గించి విక్రయిస్తున్నారు. దీంతో జీతాలు కూడా గిట్టుబాటు అయ్యే పరిస్థితి లేదని రైతు పూర్తిగా నష్ట పోతున్నాడని మేము కూడా నష్టాలు చూడాల్సి వస్తుందని రవాణా ఛార్జీలు పెరిగిపోవడం మరోపక్క ప్రభావం చూపుతుందని వ్యాపారస్తులు వాపోతున్నారు.
రాష్ట్రాభివృద్ధిని ధ్వంసం చేసి, ప్రజా సంక్షేమాన్ని విస్మరించిన సైకో జగన్ పాలన అంతమే తమ అంతిమ లక్ష్యం అని తెలుగుదేశం పార్టీ ఏలూరు నియోజకవర్గ కన్వీనర్ బడేటి చంటి, జనసేన పార్టీ ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా అధికార ప్రతినిధి, ఏలూరు నియోజవర్గ ఇన్చార్జి రెడ్డి అప్పలనాయుడు స్పష్టం చేశారు. టిడిపి, జనసేన పార్టీల సమన్వ కమిటీ సమావేశం ఏలూరు జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జరిగింది. ఈ సందర్భంగా బడేటి చంటి, రెడ్డి అప్పలనాయుడు మాట్లాడుతూ వచ్చే ఎన్నికల్లో టిడిపి, జనసేన పార్టీల నాయకులు, కార్యకర్తలు సమిష్టిగా పనిచేసి రాష్ట్రంలోని రాక్షస పాలన అంతం చేయాలన్నారు. విజన్ ఉన్న నాయకుడు రాష్ట్ర అభివృద్ధే ధ్యేయంగా పని చేసే చంద్రబాబు నాయుడు, విప్లవాత్మకమైన ఆలోచనతో ప్రజా సంక్షేమం కోసం పాటుపడుతున్న పవన్ కళ్యాణ్ ల కలయిక అధికార పార్టీ వైసిపి నాయకులు జీర్ణించుకోలేక పోతున్నారన్నారు. ఏలూరు నియోజకవర్గంలో టిడిపి జనసేన కలిసి సమిష్టిగా పని చేస్తాయని. రానున్న ఎన్నికల్లో ఏలూరు నియోజకవర్గంలో టిడిపి జనసేన జెండాలు ఎగరవేస్తామని అన్నారు.
Read Also..
ఏలూరు జిల్లా చింతలపూడి ఎం హోటల్లో జనసేన టిడిపి ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఇరుపక్షాల ముఖ్య నాయకులు, నియోజకవర్గంలోని నాలుగు మండలాల నుంచి వచ్చిన జనసేన టిడిపి నాయకులు ఒకరికొకరు పరిచయం చేసుకొని, రెండు పార్టీల అధినేతల నుండి వచ్చే ప్రధాన అంశాలను ప్రజలలోకి తీసుకువెళ్లి తెలుగుదేశం జనసేన ఉమ్మడి అభ్యర్థులను గెలిపించుకోవడానికి కృషి చేస్తామని నాయకులు అన్నారు. ఈ సందర్భంగా చింతలపూడి మాజీ ఎమ్మెల్యే గంటా మురళి మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో జగన్ ప్రభుత్వాన్ని గద్దె దింపేందుకు చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఉమ్మడి మేనిఫెస్టో సూపర్ 11 ను రెండు పార్టీలు కలిసికట్టుగా ప్రజలలో తీసుకువెళ్లి రాబోయే 2024 ఎన్నికల్లో ఉమ్మడి ప్రభుత్వాన్ని తీసుకువస్తామని అన్నారు. జనసేన పార్టీ నియోజకవర్గ కన్వీనర్ మేకా.ఈశ్వరయ్య మాట్లాడుతూ చింతలపూడి ఎస్సి నియోజకవర్గం, కానీ ఎస్సీ సబ్ ప్లాన్ నిధులు కూడా చింతలపూడి నియోజకవర్గానికి ఇవ్వకుండా వైయస్సార్ ప్రభుత్వం చింతలపూడి నియోజకవర్గాన్ని అభివృద్ధి చెందకుండా చేసిందని రాబోయే ఎన్నికల్లో జనసేన టిడిపి కలసి పనిచేసి ఉమ్మడి అభ్యర్థి గెలుపు కోసం కృషి చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీ మాగంటి బాబు, చింతలపూడి తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ పరిశీలకులు కోళ్ల. నాగేశ్వరరావు, చింతలపూడి టిడిపి మాజీ కన్వీనర్ జగ్గవరపు. ముత్తారెడ్డి, చింతలపూడి జనసేన మండల పార్టీ అధ్యక్షుడు చీదరాల. మధుబాబు తదితరులు పాల్గొన్నారు.
ఎన్టీఆర్ జిల్లా మైలవరం లో ఏసీబీ ట్రాప్, ఫారెస్ట్ ఆఫీస్ లో సెక్షన్ ఆఫీసర్ గా పనిచేస్తున్న ఏ.రామకృష్ణ ఇంటిపై ఏసీబీ దాడులు జరిగాయి, రెడ్డిగూడెం మండలం ఓబులాపురం గ్రామానికి చెందిన రైతు గండిపూడి రాంబాబు అనే వ్యక్తి రామకృష్ణ కి 23వేలు లంచం ఇస్తుండగా ట్రాప్ చేసి పట్టుకున్న ఏసీబీ అధికారులు ఫారెస్ట్ కార్యాలయం దగ్గర్లో రామకృష్ణ అద్దెకు ఉండే గదిలో తనిఖీలు చేస్తున్న ఏసీబీ బృందం.
కడప జిల్లా…
పోలీసుల అదుపులో బీటెక్ రవి మాజీ ఎమ్మెల్సీ, పులివెందుల నియోజకవర్గ ఇన్‌ఛార్జి బీటెక్ రవిని కడప నుంచి పులివెందులకు వెళుతుండగా పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టు తెలిపిన కుటుంబ సభ్యులు. బీటెక్ రవిని ఎక్కడికి తీసుకెళ్లిందీ తెలియట్లేదని, తెదేపా శ్రేణులు, కుటుంబ సభ్యులు ఆందోళన. ఏ కేసులో రవిని పోలీసులు ఆదుపులోకి తీసుకున్నారనే దానిపై కూడా ఇప్పటి వరకు లేని సమాచారం. పోలీసులు అదుపులోకి తీసుకున్న బీటెక్ రవిని రిమ్స్ కు తరలిస్తున్నట్లు సమాచారం. బీటెక్ రవికి ఏం జరిగినా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి.. పోలీసులదే బాధ్యత అంటున్న ఎమ్మెల్సీ రాంగోపాల్ రెడ్డి…
కృష్ణాజిల్లా గన్నవరం నియోజకవర్గం,
అద్దె డబ్బులు సరిపడా ఇవ్వలేదని కోపంతో కన్నతండ్రి కోటే విష్ణు మూర్తి పై విచక్షణారహితంగా ఇనుప రాడ్డుతో దాడి చేసిన వైనం బాపులపాడు మండలం, హనుమాన్ నగర్ లో నివాసముంటున్న పెదపాడు మండలం కాజీ గూడెంకు చెందిన కొటే వెంకటరావు అనే వ్యక్తి ఇంట్లో చోటు చేసుకుంది తీవ్రంగా ముఖంపై గాయాలైన విష్ణుమూర్తిని 108 అంబులెన్స్ సహాయంతో ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న హనుమాన్ జంక్షన్ ఎస్సై ఏ డి ఎల్ జనార్ధన్ సంఘటన స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
గొంతు ఎండిపోతుంది గుక్కెడు నీళ్లు ఇప్పించండి కార్యక్రమాన్ని తిరువూరు జనసేన నాయకులు చేపట్టారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకుడు పసుపులేటి నరేష్ మిత్ర (పండు) మాట్లాడుతూ.. తిరువూరు పట్టణంలో దాహం కేకలు వేస్తుందని ప్రజలకు రోజువారి మంచినీళ్లు ఇవ్వకుండా రెండు రోజులకు ఒకసారి మంచినీళ్లు ఇస్తున్నారని మూడు నెలలో ఎండాకాలం వస్తుందని ఇప్పుడే పరిస్థితి ఇలా ఉంటే రాబోయే ఎండాకాలంలో పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించాలి ఇప్పటికైనా అధికారులు, నాయకులు తెలుసుకోవాలి. ఈ ప్రభుత్వం కృష్ణాజలాలు తిరువూరుకి అందజేస్తామని చెప్పి నాలుగు సంవత్సరాలు గడిచినప్పటికీ వారు చేపట్టిన పనులలో ఎటువంటి పురోగతి సాధించలేదని కృష్ణాజలాలు తిరువూరు వాసులకు అందని ద్రాక్షా లాగా మారాయని ఇకనైన ఈ ప్రభుత్వం కళ్ళు తెరవాలి-పసుపులేటి నరేష్ మిత్ర (పండు) అన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు లింగినేని సుధాకర్ (అడ్వకేట్) , పసుపులేటి రవీంద్ర, పాపారావు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు.
Read Also..





Total views : 196553